జాజికాయతో ఆ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

జాజికాయ‌.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

వంట‌ల్లో జాజికాయను విరివిరిగా ఉప‌యోగిస్తుంటారు.

వంట‌ల‌కు మంచి రుచి, సువాస‌న అందించ‌డంలో జాజికాయ అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే రుచి, సువాస‌నే కాదు.బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా జాజికాయ‌లో దాగున్నాయి.

ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న జాజికాయ‌.మ‌న ఆరోగ్యానికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఈ కాలంలో చాలా జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతుంటారు.అలాంటి వారికి జాజికాయ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌తో కొద్దిగా జాజికాయ పొడిని క‌లిపి తీసుకుంటే.జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

అలాగే దాంపత్య సమస్యలను దూరం చేయ‌డంలో జాజికాయ‌కు మ‌రేది సాటిలేట‌.

జాజికాయ పొడి చూర్ణంగానూ లేదా వేడి పాల‌లో క‌లిసి తీసుకుంటే.శృంగాల స‌మార్థాన్ని పెంచ‌డంతో పాటు వీర్యకణాల సంఖ్య కూడా పెరుగుతుంద‌ని నిపుణులు అంటున్నారు.మ‌రియు జాజికాయ పురుషుల్లో నరాల బలహీనతను కూడా దూరం చేస్తుంది.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

అలాగే చాలా మంది నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధ ప‌డుతుంటారు.ఈ స‌మ‌స్య ఉన్న వారు ఇత‌రుల‌తో మాట్లాడేందుకు జంకుతుంటారు.

Advertisement

అయితే అలాంటి వారు తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది.కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారికి జాజికాయ ఔష‌ధంలా ప‌ని చేస్తుంది.

జాజికాయ చూర్ణం‌ను ప్ర‌తి రోజు ఉద‌యం తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు క‌రిగిపోతాయి.అలాగే గుండెల్లో మంట‌, నొప్పిని త‌గ్గించే శ‌క్తి కూడా జాజికాయ‌కు ఉంది.

ఇక నిద్ర‌లేమి ఉన్న వారు జాజికాయ‌ను ఎంచుకోవ‌డం బెస్ట్ అప్ష‌న్‌.ఒక చెంచా తేనె, చిటికెడు జాజికాయ పొడిని కలిపి నిద్రించే పావు గంటు ముందు తీసుకుంటే.

సువులుగా, ప్ర‌శాంత‌గా నిద్ర ప‌డుతుంది.కాబ‌ట్టి, జాజికాయ‌ను కూడా డైట్‌లో చేర్చుకోండి.

తాజా వార్తలు