స‌మ్మ‌ర్‌లో లెమ‌న్‌ను ఇలా తీసుకుంటే..మ‌స్తు బెనిఫిట్స్?

 ఎండ కాలం లో  రోజు రోజుకు ఎండ‌లు మండిపోతాయి.ఉద‌యం నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతాడు.

మే నెల‌లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే న‌మోదు అవుతాయి.భారీగా పెరిగే ఎండ‌ల దెబ్బ‌కు అత్యవసరమైన‌ పని ఏదైనా ఉంటే తప్ప ప్ర‌జ‌లు కాలు కూడా బయట పెట్టరు.

Health, Benefits Of Lemon Water, Summer, Summer Tips, Latest News, Health Tips,

ఇక ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.అలాంటి వాటిలో లెమ‌న్ (నిమ్మ కాయ‌) కూడా ఉంది.

అవును, స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో లెమ‌న్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రి లెమ‌న్‌ను ఎలా తీసుకుంటే మోర్ బెనిఫిట్స్ పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందు లెమ‌న్స్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు వాట‌ర్‌లో క‌ట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్క‌లు, కొద్దిగా పుదీనా వేసి.

రెండు లేదా మూడు గంట‌ల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.అనంత‌రం ఈ వాట‌ర్‌ను సేవించాలి.

ఈ వాట‌ర్‌ను లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ అని అంటారు.వేస‌వి కాలంలో చాలా మంది డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంటారు.

అయితే ఈ లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్‌ను ప్ర‌తి రోజు తీసుకుంటే.శ‌రీరం హైడ్రేట‌డ్‌గా ఉంటుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

అలాగే ఈ వాట‌ర్‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే.వేస‌విలో ఇబ్బంది పెట్టే అతి దాహం, నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Advertisement

త‌ల‌నొప్పి, ఒత్తిడి వంటి జ‌బ్బులు కూడా దూరం అవుతాయి.కొంద‌రు స్పైసీ ఫుడ్ తిన్న త‌ర్వాత నోటి దుర్వాస‌న‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.

అయితే భోజ‌నం త‌ర్వాత ఈ వాట‌ర్ తీసుకుంటే నోరు ఫ్రెష్‌గా మారుతుంది.అదే స‌మ‌యంలో జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగుప‌డుతుంది.

దాంతో గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మస్య‌లకు దూరంగా ఉండొచ్చు.ఇక ఈ వాట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.

‌ .

తాజా వార్తలు