రెగ్యుల‌ర్‌గా చ‌పాతీ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

సాధార‌ణంగా చాలా మంది బ‌రువు త‌గ్గాలంటే ముందుగా చేసే ప‌ని. రైస్‌కు బ‌దులుగా చ‌పాతీ తీసుకోవ‌డం.

గోధుమ పిండితో చేసే చ‌పాతీల‌ను ఏదైనా క‌ర్రీల‌తో రెగ్యుల‌ర్‌గా తీసుకుంటారు.మ‌రి ఇలా రెగ్యుల‌ర్‌గా చ‌పాతీలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? అంటే మంచిదే.డాక్టర్లు కూడా ఈ మధ్య కాలంలో నైట్ టైం రైస్‌కు బ‌దులుగా చపాతీలు తినమనే సజెస్ట్ చేస్తున్నారు.

అయితే రెగ్యుల‌ర్‌గా చ‌పాతీలు తీసుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు.మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చ‌పాతీల‌ను నూనె లేదా వెన్న‌ లేకుండా కాల్చుకుని తీసుకుంటే.

త‌క్కువ కేల‌రీలు ల‌భిస్తాయి.త‌ద్వారా మ‌రింత సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.

Advertisement

చ‌పాతీల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది.కాబ‌ట్టి, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు చ‌పాతీలు తీసుకోవ‌డం వ‌ల్ల ‌హీమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.

అలాగే ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉండే చ‌పాతీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ధకం స‌మ‌స్య‌ను నివారిస్తుంది.

చ‌పాతీల‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.చపాతీలో ఉండే జింక్ మ‌రియు విటమిన్ బి, ఇ చ‌ర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.

అలాగే చ‌పాతీలో ఉండే సెలీనియం కంటెంట్ కొన్ని ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ర‌క్షిస్తుంది.రైస్‌కు బ‌దులుగా చ‌పాతీలు తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

మ‌రియు గుండె జ‌బ్బులు, ఇత‌ర గుండె స‌మ‌స్య‌లు రాకుండా కూడా ర‌క్షిస్తుంది.అయితే మంచిది క‌దా అని అతిగా మాత్రం చ‌పాతీలు తీసుకోరాదు.

Advertisement

రోజుకు కేవ‌లం మూడు లేదా నాలుగు చ‌పాతీలు మాత్ర‌మే తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.నాలుగు మించి తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు పెర‌గ‌డంతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తాజా వార్తలు