మధ్యాహ్నం నిద్ర వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?!

మ‌న‌లో చాలామందికి నిద్ర అంటే అదో సుఖం.వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఓ కునేకేయాల‌ని అనుకుంటాం.

కానీ మ‌నకున్న బిజీ లైఫ్‌కు అస‌లు స‌రిగ్గా నిద్ర ఎక్క‌డిది అంటారా అవున‌నుకోండి.కానీ చాలామందికి ఇప్పుడు ఈ క‌రోనా కార‌ణంగా ఫ్రీటైమ్ దొరుకుతోంది.

దీంతో మ‌ధ్యాహ్నం పూట ప‌డుకోవ‌డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.అయితే ఇది ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలుస్తోంది.

మ‌న‌కు తిన్న తర్వాత మధ్యాహ్నం సమయంలో నిద్ర ఎక్కువగా వస్తుంది అది చాలా మందికి వీక్ నెస్ పాయింట్‌.ఇక ఆఫీసుల్లో ఉండే వాళ్ళు అయితే బాస్‌కు తెలియ‌కుండా కొంచెం సేపు నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు.

Advertisement
Health Benefits Of Afternoon Sleep, Afternoon Sleep,Afternoon Nap Benefits, Impr

అంతే కాదు వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా మ‌ధ్యాహ్నం కాగానే ఏదోఒక చెట్టుకింద కొంచెం సేపు ప‌డుకోవాల‌ని చూస్తారు.

Health Benefits Of Afternoon Sleep, Afternoon Sleep,afternoon Nap Benefits, Impr

అయితే ఇలా మధ్యాహ్నం నిద్ర అలవాటు అయితే రాత్రి పూట నిద్ర రాద‌నేది ఒక స‌మ‌స్య‌.మ‌ధ్యాహ్నం నిద్ర‌పోవ‌డం చాలా కష్టంగా ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు కొంత‌మంది.మ‌రికొంత మందికేమో మ‌ధ్యాహ్నం నిద్ర పోవ‌డం ఒక వ్య‌స‌నం లాంటిది.

ఈ నిద్ర వ‌ల్ల చాలా మంచిది అని కూడా చెప్తున్నారు.దీని వ‌ల్ల నిద్రలేమి సమస్యలు ఉన్న వారికి సహా చాలా మందికి మేలు చేస్తుంది అని చెప్తున్నారు.

దీనివ‌ల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంద‌ని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.బీపీ ఉన్న వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందంట‌.

న్యూస్ రౌండప్ టాప్ 20

శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను ఇది ప‌ర్‌ఫెక్ట్ చేస్తుందంట‌.ఇక షుగర్, థైరాయిడ్ లాంటి సమస్యలు ద‌రిచేర‌వ‌ని తెలుస్తోంది.

Advertisement

తిన్న తిండి కూడా మంచిగా జీర్ణం అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.కొవ్వుతో బాధ‌ప‌డుతున్న‌వారికి ఇది చాలా మేలు చేస్తుంద‌ని చెబుతున్నారు.

కొవ్వును త్వ‌ర‌గా క‌రిగించు కోవాలంటే ఈ మ‌ధ్యాహ్నం నిద్ర‌ను ఫాలో అయితే స‌రిపోతుంద‌ని చాలా మంది చెబుతున్నారు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

తాజా వార్తలు