టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన సుమన్ ( suman )చాలా సంవత్సరాల క్రితం జైలుకు వెళ్లడం ఆయన అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.సుమన్ జైలుకు వెళ్లడానికి ఒక స్టార్ హీరో కారణమని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
వాస్తవం ఏంటంటే సుమన్ జైలుకు వెళ్లడానికి ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు కారణమట.దర్శకుడు సాగర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
సుమన్ జైలుకు వెళ్లడం గురించి ఈ దర్శకుడు షాకింగ్ నిజాలను వెల్లడించారు.సుమన్ అసలు పేరు సుమన్ తల్వార్ కాగా మద్రాస్ లో పుట్టి పెరిగిన ఈ నటుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం నటించి నటుడిగా పాపులారిటీని పెంచుకున్నారు.700కు పైగా సినిమాలలో సుమన్ నటించగా తెలుగు సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.అయితే సుమన్ బూతు చిత్రాలను తీసినట్టు ఆరోపణలు రావడంతో ఆయన అరెస్ట్ అయ్యారు.
అరెస్ట్ కావడం వల్ల సుమన్ జైలు జీవితం గడిపారు.సుమన్ తో పలు సినిమాలు తీసిన సాగర్ తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్( M.G.Ramachandran ), అప్పట్లో పని చేస్తున్న డీజీపీ, వడియార్ అనే లిక్కర్ కాంట్రాక్టర్ సుమన్ జైలుకు వెళ్లడానికి కారణమని అన్నారు.సుమన్ ఫ్రెండ్ ఒకరు లిక్కర్ కాంట్రాక్టర్ కూతురిని ప్రేమించగా డీజీపీ కూతురికి సుమన్ అంటే ఇష్టమని సాగర్( Sagar ) అన్నారు.సుమన్ షూటింగ్ ఎక్కడ జరిగినా ఆ అమ్మాయి వచ్చేదని సాగర్ చెప్పుకొచ్చారు.
కూతురు సుమన్ ట్రాప్ లో పడిందని డీజీపీ సీఎంకు చెప్పారని, సుమన్ ఫ్రెండ్ వ్యవహారం కూడా సీఎంకు తెలిసిందని సీఎం సుమన్ తో డీజీపీ కూతురుకు దూరంగా ఉండాలని చెప్పారని ఆయన అన్నారు.నాకు కాదు ఆ అమ్మాయికి చెప్పాలని సుమన్ కోరడంతో ఎంజీఆర్ కు కోపం వచ్చిందని సాగర్ వెల్లడించారు.
ఆ తర్వాత తప్పుడు కేసు పెట్టి సుమన్ ను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు.సుమన్ గురించి ఈ విషయాలు తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.