ఆయన గతి శీల రాజకీయాల్లో ఆరి తేరిన దిట్ట.పెద్ద రాజకీయ నేత కాకపోయినా సరే విమర్శకుడిగా మాత్రం ఉన్నారు.
ఆయన చెప్పే ప్రతి మాట రాజకీయాల్లో టెన్షన్ పెంచుతూనే ఉంటుంది.ఆయన వైఎస్సార్ దయతోనే రెండుసార్లు ఎంపీగా గెలిచారు.
కానీ ఆ తరువాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు.అలా అని కనుమరుగై పోకుండా నిత్యం రాజకీయ విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు.
ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా నిత్యం అన్ని పార్టీలను చెడుగుడు ఆడేసుకుంటున్నారు.ఇప్పటికే మేము ఎవరి గురించి చెబుతున్నామో మీకు అర్థం అయే ఉంటుంది.
అవునండి ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అంటారా.అక్కడికే వస్తున్నాం.ఆయన ఇప్పుడు నెలకోసారి ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీని ఉతికి ఆరేస్తున్నారు.
మరీ ముఖ్యంగా వైసీపీనే టార్గెట్ చేయడంతో ఆ విమర్శలు కాస్తా జనాల్లోకి బలంగా వెళ్తున్నాయి.ఇదే వైసీపీకి చిక్కులు తెచ్చిపెడుతోంది.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆయన విమర్శలను కౌంటర్ చేసేందుకు ప్రభుత్వ పెద్దలు జంకుతున్నారు.ఎక్కడ తాము రిప్లై ఇస్తే తమ గురించి విమర్శల బాణాలు ఎక్కుపెడుతారో అని ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారు కూడా వెనకడుగు వేస్తున్నారు.

అయితే వైసీపీ అంటే మహా నేతలను కూడా ఎదురొడ్డి నిలిచిన పార్టీ.ఎంతోమంది ఉద్ధండులు బలవంతులను కూడా ఎదుర్కుని నిలబడ్డ పార్టీ.అలాంటిది ఉండవల్లి విషయంలో మాత్రం ఎందుకో వెనకడుగు వేస్తోంది.నిజానికి ఉండవల్లికి రాజకీయ జీవితం ఇచ్చింది వైఎస్సార్.కానీ ఆయనకుమారుడు అయిన జగన్ మీదే ఇప్పుడు ఉండవల్లి విమర్శలు చేయడం సంచలనంగా మారింది.ఆయన ఏ పార్టీ తరఫున మాట్లాడకుండా ఒక పౌరుడిగానే వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే జగన్ ని అట్టర్ ఫ్లాప్ పాలన అంటూ పెద్ద బాంబే పేల్చుస్తున్నారు.మరి ఆయన్ను జగన్ ఎలా సైడ్ చేస్తారనేది చూడాలి.