కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ కి షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. !!

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ కు కేంద్రం ఒక పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

అది ఏంటంటే ఏపీ లో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్టే కనిపిస్తుంది.

జనగణన పూర్తి కాకపోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు  బ్రేక్ పడినట్లు తెలుస్తుంది.జనగణన పూర్తయ్యేంత వరకు గ్రామాలు, మండలాలు, జిల్లాలు, సరిహద్దులను ఫ్రీజ్ చేసి అలాగే ఉంచాలని, మార్పులు చేయరాదని  గతంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే.

తరువాత ఆర్టీఐ ద్వారా జిల్లాల పునర్విభజన అంశం మళ్ళీ తెరమీదకి వచ్చింది.ప్రస్తుతం ఏపీ లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించింది.

అయితే తాజాగా జగన్ ఆలోచనకు కేంద్రం అడ్డుకట్ట వేసిందని చెప్పాలి.కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరో ఏడాదిన్నర వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడే అవకాశం వుందని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement
He Central Government Gave A Shock To Jagan Regarding The Formation Of New Distr

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదు.ఆ కారణంగా జనగణన ఇంకా  పూర్తి కాలేదు.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబందించి జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రత్యేక సబ్‌ కమిటీలు నియమించారు.

He Central Government Gave A Shock To Jagan Regarding The Formation Of New Distr

జిల్లాల సరిహద్దులు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి కమిటీ- 1, నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి కమిటీ- 2, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి కమిటీ- 3, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్  కమిటీ- 4 ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఇలా మొత్తంగా 4 కమిటీలను ఏర్పాటు చేసి జిల్లాలను విభజించాలని ఆలోచన చేసారు.కానీ ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో మరో ఏడాదిన్నర కాలం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు