వైరల్: తలకి ఫ్యాన్‌ తగిలించుకున్న విచిత్రమైన ఈ వ్యక్తిని చూసారా? చూస్తే దండం పెడతారు!

కవితకు కాదేది అనర్హం అన్న మాట ఔపోసన పట్టదేమోగాని ఇక్కడ వీడియోలో వున్న వ్యక్తిని చూస్తే గుడ్లు తేలేస్తారు.

ఓ రకంగా మీరు అతని సృజనాత్మకతకు, మేథస్సును చేతులు జోడించినా ఆశ్చర్యపోనవసరం లేదు మరి.

అతని ప్లాన్ చూస్తే ఎంతోమందికి అది ఆదర్శంగా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఇలాంటి ఆవిష్కరణలు తాము ఎదర్కొంటున్న సమస్యల నుంచి బేసిగ్గా పుట్టుకొస్తాయి.

ఇక్కడొక సామాన్య వ్యక్తి తన సమస్యకు చెక్‌పెట్టే ఒక వినూత్న ఆవిష్కరణకు తెర లేపాడు.పూర్తి వివరాల్లోకెళ్తే.

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక బాబాజీ ఫ్యాన్‌తో కూడిన హెల్మట్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.అదలాగా తగిలించుకోవడానికి గల కారణం ఏమిటని స్థానికులు అతనిని అడగగా ఆయన ఎండలో నడిచి వెళ్ళేటప్పుడు ఉక్కపోతను భరించలేక నానా ఇబ్బందులు పడేవారట.

Advertisement

అదీగాక సాధువులు, బాబాజీలు పాదాచారులగా బిక్షటన చేసి జీవిస్తుంటారు కదా.అలా వారికి నచ్చిన ప్రాంతాలకు తరలిపోతూ.ఇక అక్కడే ఏ ఆశ్రమాలకో వెళ్లి జపాలు, ధ్యానాలు వంటివి చేస్తుంటారు.

ఈ క్రమంలో ఆ బాబాజీ పాదాచారిగా వెళ్తుంటే బయట ఎండ ధాటికి తట్టుకోలేక ఒక వినూత్న ఆవిష్కరణ చేయాలని ఐడియా వచ్చిందట.అంతే ఇక సోలార్‌ శక్తితో పనిచేసే ప్యాన్‌ హెల్మట్‌ ని అతను తయారు చేసుకున్నాడు.ఆ వ్యక్తి ఒక హెల్మట్‌కి ఫ్యాన్‌, సోలార్‌ ప్లేట్‌ అమర్చి హెల్మట్‌ మాదిరిగా ధరించడం ఈ వీడియోలో చూడవచ్చును.

చూసేందుకు తలపాగ మాదిరిగా వున్నా, ఎంతటి ఎండలోనైనా హాయిగా చల్లటి గాలిని ఆశ్వాదిస్తూ వెళ్లేలా రూపొందించాడు.దాంతో జనాలు ఆ బాబా తెలివికి మంత్రముగ్దులయ్యారు.

Ashwini Dutt : నా కెరీర్ లో అత్యంత లాభాలు పొందిన సినిమా అదే
Advertisement

తాజా వార్తలు