టైర్ల స్మశానం ఎప్పుడైనా చూశారా.. ఇది ఎంత పెద్దదో తెలిస్తే..

సాధారణంగా ఒకచోట 1,000 టైర్లను వేస్తేనే చాలా స్థలం నిండిపోతుంది.అలాంటిది ఒక దేశంలో లక్షల కొద్ది టైర్లను ఒకే దగ్గర వేస్తారు.

అరిగిపోయిన, పాడైపోయిన టైర్లన్నీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పడేస్తారు.అక్కడే వాటిని కాల్చేస్తారు.

అందుకే ఈ ప్రాంతాన్ని టైర్ల స్మశాన వాటికగా ( graveyard of tires )పిలుస్తారు.ఈ ప్రాంతం కువైట్ నగరానికి దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సులైబియాలో( Sulaibia ) ఉంది.

ఈ ప్రదేశానికి వెళ్లి ఎటు చూసినా టైర్లే కనిపిస్తాయి.కొన్ని కిలోమీటర్ల వరకు కనుచూపుమేర టైర్లు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తాయి.

Advertisement

కువైట్‌లోని టైర్ శ్మశానవాటికను ప్రపంచంలోని అతిపెద్ద టైర్ శ్మశానవాటిక అని పిలుస్తారు.టైర్ స్మశాన స్థలం విస్తారమైన ప్రదేశంలో విస్తరించి ఉంది, ఇది మిలియన్ల కొద్దీ వాడి పడేసిన టైర్లతో పర్యావరణానికి సంబంధించిన ముఖ్యమైన అంశంగా మారింది.1990వ దశకంలో గల్ఫ్ యుద్ధ సమయంలో సైనిక అవసరాల కోసం అనేక టైర్లను ఈ ప్రాంతానికి తీసుకువచ్చేవారు.అప్పటినుంచి ఈ స్మశాన వాటికలో టైర్లు పేరుకుపోవడం ప్రారంభమైంది.

యుద్ధం తరువాత, సైనికులు టైర్లను అక్కడే వదిలివేశారు.ఇది టైర్ స్మశానవాటిక సృష్టికి దారితీసింది.

సాధారణంగా ఒక టైరు 30 వేల కిలోమీటర్ల తరువాత నిరూపయోగంగా మారుతుంది.వాటితో వాహనాలు నడపటం కుదరదని తెలిసినాక వాటిని పడేయక తప్పదు.ఎందుకంటే వీటిని రీసైకిల్ చేయడం దాదాపు అసాధ్యం.

ఒకవేళ టైర్లను కరిగించి రీసైకిల్ చేయాలని చూస్తే అది కాలుష్యానికి దారి తీయవచ్చు.పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

ఇక ప్రపంచంలో ఏటా 150 కోట్ల టైర్లు అరిగిపోయి చెత్త కుప్పకు చేరుకుంటున్నాయి.వీటి వ్యర్థాలను కొందరు కాల్చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు