మొబైల్ క్లాత్ స్టోర్ ఎప్పుడైనా చూశారా... వీడియో వైరల్...

బెంగళూరు( Bangalore ) భారతదేశంలో స్టార్టప్‌లు, ఇన్నోవేషన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.ఎల్లప్పుడూ కొత్త, క్రియేటివ్ ప్రొడక్ట్స్‌, ఆలోచనలతో ఈ నగరం ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది.

అందుకే ఈ సిటీని స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా( Startup Capital of India ) అని పిలుస్తారు.తాజాగా ఈ నగరంలో మరొక క్రియేటివ్ ఇన్నోవేషన్ ఒకటి వెలుగులోకి వచ్చింది.

అదే, రోడ్డుపై బట్టలు అమ్ముతున్న లారీ.సాధారణంగా బట్టల కొనుగోలు చేయాలంటే మనం స్టోర్ రూమ్స్ కి లేదా షాప్ కి వెళ్తాము.

కానీ మొత్తం షాప్ ఏంటి ముందుకు వస్తే ఉంటుంది? చాలా టైమ్‌, శ్రమ ఆదా అవుతుంది కదా? ఆన్‌లైన్ షాపింగ్ కంటే ఈ మొబైల్ క్లాత్ స్టోర్ లో షాపింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

Advertisement

పేవ్‌మెంట్‌పై బట్టలు విక్రయించే ఇతర వీధి వ్యాపారుల మాదిరిగానే ఇది కూడా ఉంటుందని అనుకోవచ్చు.కానీ ఇది భిన్నంగా ఉంటుంది. ఫ్యాన్సీ ఫ్యాషన్ స్టోర్( Fancy fashion store ) లాగా కనిపించే ట్రక్కు ఇది.ఇది లోపల బట్టలు చూపించే గ్లాస్ విండో కలిగి ఉంది.ఇది ఎక్కడికైనా వెళ్లగలిగే మొబైల్ షోరూమ్ లాంటిది.

సాధారణంగా సెలబ్రిటీలకు బట్టలు ఇలాగే ఇంటికి వస్తాయి సామాన్యులకు కూడా ఇలా రావడం చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది.

@HaramiPrindey అనే వినియోగదారు ఈ ట్రక్కు ఫొటోను X అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు.బెంగళూరు’లో భార్యతో కలిసి గుడికి వెళుతున్నప్పుడు ఈ ట్రక్కును గుర్తించాను.అని దీనికి అతడు క్యాప్షన్ జోడించారు.

“నేను ఫుడ్ ట్రక్కుల గురించి విన్నాను, కానీ బట్టల ట్రక్కు చూడటం ఇదే తొలిసారి.” అని ఒక యూజర్ సరదాగా కామెంట్ చేశాడు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

కొంతమంది ట్రక్కు ఏమి అమ్ముతోందని ఆశ్చర్యపోయారు.ఈ వైరల్ ట్రక్కు ఫొటోపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు