బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామా ? తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ? 

మూడోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఆ పార్టీతో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu) అనేక రకాలుగా ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపి పెద్దలను ఒప్పించి ఏపీలో పొత్తు పెట్టుకున్నారు.

టిడిపి ,జనసేన, బిజెపిలు కలిసి వైసీపీ ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.

కాకపోతే బిజెపి వ్యవహరిస్తున్న తీరు టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు , ఆ పార్టీ కేడర్  కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.దీనికి కారణం బిజెపి ఏపీలో అనుసరిస్తున్న వ్యవహార శైలే కారణం.

బిజెపి పోటీ చేస్తున్న పది అసెంబ్లీ , ఆరు పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో అసలు టిడిపి కేడర్ కు ఎందుకు సహకరించాలంటూ ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉండడం, బిజెపితో పొత్తు వల్ల కలిసొచ్చే దానికంటే నష్టమే ఎక్కువగా ఉందనే అభిప్రాయం టిడిపి నేతల్లో కలుగుతుంది.

 ఏపీలో బిజెపి , టిడిపి( BJP, TDP ) తో పొత్తు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాలు టిడిపి నేతల్లో కలుగుతున్నాయి .ఏపీ బీజేపీ నేతల వ్యవహారం ఎలా ఉన్నా,  ఢిల్లీ బిజెపి పెద్దలు మాత్రం ఏపీలో తాము పొత్తు పెట్టుకున్నామన్న విషయాన్ని మరిచిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు.తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపైనే పూర్తిగా ఫోకస్ చేసిన బిజెపి అగ్ర నేతలు , ఏపీ లో ప్రచారం నిర్వహించేందుకు అంతగా ఆసక్తి చూపించకపోవడం,  ఏపీలో కూటమి లేనట్టుగానే ఢిల్లీ బిజెపి పెద్దలు వ్యవహరిస్తున్నారు.

Advertisement

ఇవన్నీ చంద్రబాబుకు అసంతృప్తిని కలిగిస్తున్నాయి.అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిజెపితో పొత్తు రద్దు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో,  సైలెంట్ గానే ఉన్నారు అసలు బిజెపితో పొత్తు పెట్టుకోకుండా జనసేన తోనే కలిసి ఎన్నికలకు వెళితే బాగుండేదనే అభిప్రాయాలు టిడిపి నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.

 తెలంగాణలో అమిత్ షా( Amit Shah ) , ప్రధాని నరేంద్ర మోది పర్యటనలు చేస్తున్నా .ఇప్పటివరకు ఏపీలో వారు పర్యటించకపోవడాన్ని టిడిపి అధినేత తో పాటు,  ఆ పార్టీ క్యాడర్ తప్పు పడుతున్నారు .మరో రెండు వారాల్లో పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో,  మొక్కుబడుగా ఒకటి రెండుసార్లు బిజెపి అగ్ర నేతలు మోదీ,  అమిత్ షాలు ఏపీలో పర్యటించినా పెద్దగా ఉపయోగ ఉండదనే అంచనాలు ఉన్నారు.వైసిపి అధినేత జగన్( CM ys jagan ) తో సన్నిహిత సంబంధాలు ఇప్పటికే బిజెపి అగ్ర నేతలు కొనసాగిస్తుండడం , పరోక్షంగా ఆ పార్టీకి సంకరించే ఆలోచనతో ఉండడంతోనే తమతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలు అంచనాకు వస్తున్నారు.

  ఇటీవల మేనిఫెస్టో విడుదల సందర్భంగా దానిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో వేయవద్దనడం , మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి బిజెపి నేత సిద్ధార్థ సింగ్ హాజరైనా,  ఆయన మేనిఫెస్టో కాఫీని ముట్టుకోవడానికి నిరాకరించడం , తమది జాతీయ పార్టీ అని,  తమ మేనిఫెస్టో వేరు అన్నట్లుగా ఆయన వ్యవహరించడం వంటివన్నీ చంద్రబాబుకు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తప్పవా..?
Advertisement

తాజా వార్తలు