బాలీవుడ్ నటి రేఖ ( Bollywood Heroine Rekha ) ఇప్పటికీ యంగ్ హీరోయిన్ లా పాతికేళ్ల అమ్మాయిలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 69 ఏళ్ల వయసు ఉంది.ఏడు పదుల వయసుకు దగ్గర పడుతున్నా కూడా ఇంకా తన అందంతో ఆకట్టుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే కేవలం రేఖ అనే చెప్పుకోవాలి.
ఎందుకంటే వృద్ధాప్యం దగ్గర పడ్డా కూడా ఆమె అంత అందంగా ఉండడం చూసి చాలామంది కుళ్లుకుంటారు కూడా.అయితే అలాంటి ఈమె జీవితం లో ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, పుకార్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫేస్ చేసింది.
ఇక ఈమె కు సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ సినిమాల్లో రాణించడానికి ఎన్నో ఇబ్బందులు పడింది.
ఇక రేఖ సినిమాల కంటే ఎక్కువగా ఎఫైర్ ల ద్వారానే ఇండస్ట్రీలో వైరల్ అయింది.
ఇక రేఖ పేరు చెబితే ఎక్కువగా వినిపించేది అమితాబచ్చన్ పేరు మాత్రమే.ఇక అమితాబ్ బచ్చన్ ( Amithab bacchan ) రేఖ రెండో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి.
కానీ జయా బచ్చన్ జోక్యంతో వీరి మధ్య ఉన్న ప్రేమాయణం ముగిసింది అంటూ ఇలా ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే రేఖ కి కేవలం అమితాబ్ బచ్చన్ తోనే కాకుండా చాలామందితో రిలేషన్ వార్తలు వినిపించాయి.
అలా మొదట జితేంద్ర ( Jithendra ) తో రేఖకు ఎఫైర్ వార్తలు వినిపించాయి.

కానీ అప్పటికే జితేంద్ర కు పెళ్లవ్వడంతో వారి రిలేషన్ ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు.ఆ తర్వాత హీరో గా.విలన్ గా.ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలిన కిరణ్ కుమార్ ( Kiran kumar) తో కూడా ఈమెకు ఎఫైర్ ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.అంతేకాకుండా మరో బాలీవుడ్ నటుడు వినోద్ మెహ్ర తో కూడా రేఖకు రిలేషన్ ఉందని, వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని ఒక పుకారు వినిపించింది.
అయితే ఈ పుకారు పై రేఖ వినోద్ ఇద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలు ఆగిపోయాయి.ఇక చివరికి రేఖ బిజినెస్ మ్యాన్ అయినా ముఖేష్ అగర్వాల్ ని పెళ్లాడింది.

అయితే వీరి వివాహ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు.పెళ్లయిన కొద్ది రోజులకే ముకేష్ అగర్వాల్ ( Mukhesh agarwal ) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు.ఇక ఆ సమయంలో రేఖ గురించి బాలీవుడ్ మీడియా మొత్తం ఎన్నో వార్తలు వైరల్ చేశారు.ఇక ఈయన మరణం తర్వాత రేఖ పేరు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తో కూడా వినిపించింది.
కానీ మా మధ్య ఎలాంటి బంధం లేదు అని రేఖ,సంజయ్ దత్ ( Sanjay datth ) ఇద్దరూ ఖండించారు.ఇలా రేఖ ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఎన్నో రకాల పుకార్లను ఎదుర్కొంది.
ఇక ఇందులో కొన్ని నిజాలైతే మరికొన్ని అబద్ధాలుగా మిగిలిపోయాయి.