కొత్తగా వచ్చిన విజయం తెలుగుదేశంలో అతి విశ్వాసాన్ని తీసుకొచ్చిందా?

విజయానికి బంధువులు ఎక్కువ అపజయం ఎప్పుడూ అనాదే .

ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయం తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party )లో అతివిశ్వాసం తీసుకొచ్చినట్లుగా కనబడుతుంది.

ఇప్పటిదాకా జనసేనతో కలిసి పోటీ చేస్తే తప్ప విజయం సాధించడం కష్టమని వినిపించిన అంచనాల మధ్య ఇప్పుడు ఏ పొత్తు అవసరం లేకపోయినా సింగిల్గానే అధికారంలోకివచ్చేస్తామని ఒక వేల పొత్తు అనివార్యం అనుకుంటే 20 సీట్ల కి మించి జనసేన కు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు చేస్తున్నఅత్యుత్సాహపు ప్రకటనలు పార్టీ అధినాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి అని సమాచారం.

ఏది ఏమైనప్పటికీ జనసేన( Janasena )తో కలిసే 2024 లో పోటీ చేయాలని టిడిపి అధిష్టానం ఇప్పటికే నిర్ణయించుకుంది, సీట్ల దగ్గర పంచాయతీని పరిష్కరించుకుంటే కచ్చితంగా అధికారంలోకి రావడానికి జనసేన మద్దతు తప్పనిసరి అని టిడిపి అధినాయకత్వం బలంగా నమ్ముతుంది.ఇప్పుడు ఈ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఈ సీట్ల పంచాయతీని మరింత పీటముడి లా చేసి జటిలం చేసే విధంగా ఉందని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లుగా సమాచార.ఏది ఏమైనా పోరాడి ఓడిపోతాం అనుకున్న సీట్లలో విజయం పార్టీలో కొంత ఆత్మ విశ్వాసాన్ని పెంచినట్లుగానే తెలుస్తుంది .అయితే జగన్( Jagan ) ప్రభుత్వాన్ని ఓడించే స్థాయికి పార్టీ బలపడిందో లేదో అన్న అంతర్మదనం పార్టీ కీలక నాయకుల్లో కలుగుతుందని వార్తలు వస్తున్నాయి.వాపుని చూసుకొని బలుపని సింగల్ గా ఎన్నికలకు వెళితే మరొకసారి బంగపాటు తప్పదని అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పొత్తును విజయవంతం చేసుకుని ఎన్నికలకు వెళ్లాలన్నట్టుగా టిడిపి అధినాయకత్వం లెక్కలు వేసుకుంటుంది .అందుకే ఇప్పుడు అత్యుత్సాహపు ప్రకటనలు చేస్తున్న నాయకులను ఆచితూచి మాట్లాడమంటూ అక్షతలు వేశారట .

తెలుగుదేశం సాధించిన ఈ విజయం పొత్తు ప్రభావం చూపుతుందననే ఆలోచనలు జనసేన వర్గాల్లో కూడా చర్చకి వచ్చినట్లుగా తెలుస్తుంది.మొన్నటి వరకు పొత్తు తెలుగుదేశం అవసరమని ఇప్పుడు పొత్తు రెండు పార్టీలకు అవసరమనే వాతావరణ వచ్చిందని ,ఇది ఇప్పుడు బలంగా సీట్లు డిమాండ్ చేయడానికి కొంత ఇబ్బందికర వాతావరణ సృష్టించినట్లుగా జనసేన వర్గాలు బావిస్తునట్టు సమాచారం .

Advertisement
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

తాజా వార్తలు