మల్లారెడ్డి మనసు మారిందా ? బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల విమర్శలు అందుకేనా ? 

గత కొంతకాలంగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నిత్యం వార్తలు ఉంటున్నారు.ఆయనకు చెందిన వ్యాపార వ్యవహారాలపై ఐటీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు.

 Has Mallareddy Changed His Mind Is This The Reason For The Criticism Of Brs Mlas-TeluguStop.com

అధికారులు చేపడుతున్న తనిఖీల్లో ఎన్నో అవకతవకులు బయటపడుతున్నట్లుగా మీడియాకు లీకులు వస్తున్నాయి.ఇక పూర్తిగా మల్లారెడ్డి ఇరుక్కున్నట్టేనని, ఆయనను ఎవరు కాపాడలేరని  ప్రచారం జరుగుతున్నా,  మల్లారెడ్డి మాత్రం ఈ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.

తనకు కేసిఆర్ అండ ఉండగా ఏమీ కాదని గొప్పగా ప్రకటించుకున్నారు.సరిగ్గా ఇదే సమయంలో మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి వ్యవహారాలపై వారంతా ఫైర్ అయ్యారు.తమకు ప్రాధాన్యం దక్కకుండా తమ తమ నియోజకవర్గంలో మల్లారెడ్డి పెత్తనం చేస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు.

దీనికి మైనంపల్లి హనుమంతరావు నేతృత్వం వహిస్తున్నారు.

    మల్లారెడ్డి కి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్న,  బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఈ విషయంలో లైట్ తీసుకుంది.

ఇక మల్లారెడ్డి వ్యతిరేక వర్గం అంత గ్రూపుగా తిరుమలకు కూడా వెళ్లారు.దీన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకోలేదు.మామూలుగా అయితే సొంత పార్టీ నాయకులపై ఆ పార్టీలోని వారే విమర్శలు చేస్తే అధిష్టానం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది.కానీ మల్లారెడ్డి విషయంలో స్వయంగా ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ,  హడావుడి చేస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం సైలెంట్ గా ఉండడంతో అధిష్టానం ప్రోత్సాహంతోనే మల్లారెడ్డి పై ఈ విమర్శలు దాడి, అసంతృప్తులు మొదలయ్యాయనే అనుమానాలు కలుగుతున్నాయి.

అసలు దీని అంతటికి కారణం మల్లారెడ్డి బిజెపి అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లడమే కారణమనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.ఆయన బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని,  ఈ మేరకు బిజెపి అగ్రనేతలతో ఒప్పందం కూడా చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

దీనికి మరింత బలం చేకూరుస్తూ ఇటీవల మల్లారెడ్డి ఇంట్లో ఐటి దాడులు జరిగిన తర్వాత అనేక ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి.
 

Telugu Chamakura Malla, Telangana, Telangana Malla-Political

  మెడికల్ కాలేజీలు,  ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారాల్లో ఈడిని కూడా రంగంలోకి దిగాలని ఐటి కోరింది.కానీ ఈడి ఇంతవరకు రంగంలోకి దిగక పోవడంతో బిజెపి అగ్ర నేతలతో మల్లారెడ్డి టచ్ లోకి వెళ్లడమే కారణమనే అనుమానాలు మొదలయ్యాయి.అందుకే బీఆర్ఎస్ అధిష్టానం మల్లారెడ్డి విషయంలో సీరియస్ గా ఉందని,  మల్లారెడ్డి సొంత జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలంతా ఈ విధంగా సమావేశాలు నిర్వహిస్తూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారని, త్వరలోనే మల్లారెడ్డి మంత్రి పదవి కూడా ఊడడం ఖాయమనే  ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube