బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ బ్రెయిన్‌కు చాలా మేలు చేస్తాయి.వీటిని సాల్వ్ చేయడం ద్వారా కాన్సన్ట్రేషన్ అబ్జర్వేషన్స్ స్కిల్స్ మెరుగుపడతాయి.
లాజికల్ గా క్రియేటివ్ గా ఆలోచించేలా అవి ప్రేరేపిస్తాయి.అవి ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గించగలవు.
అందుకే వీటిని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా( Harsh Goenka ) తరచుగా తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటారు.ఈ పారిశ్రామికవేత్తకు ట్విట్టర్‌లో ఏకంగా 18 లక్షల మంది పాల్గొన్నారు.
వారిందరితో టీజర్లు, పజిల్స్‌ను పంచుకోవడానికి ఇష్టపడతారు.అతను రీసెంట్ గా మరో బ్రెయిన్ టీజర్( Brain Teaser )ను పోస్ట్ చేశారు, దీనిని కామన్ సెన్స్ ఉపయోగిస్తే సాలు చేయవచ్చు.
ఆయన ఈసారి ఒక ఫ్యామిలీకి సంబంధించిన ప్రశ్నను వేశారు.“ మీ తల్లిదండ్రులకు మీతో సహా ఆరుగురు కుమార్తెలు ఉన్నారు, ప్రతి కూతురికి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు.అలాంటప్పుడు మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు?" అని ప్రశ్న వేశారు.ఈ పోస్ట్‌కు 2 లక్షల కంటే వ్యూస్, 500 దాక కామెంట్లు వచ్చాయి.
కొంతమంది ప్రశ్నను సరిగ్గా పరిష్కరించారు, మరికొందరు ఫన్నీ లేదా తప్పు సమాధానాలు ఇచ్చారు.భారతీయులందరూ అతని లేదా ఆమె సోదరులు, సోదరీమణులు కాబట్టి, సమాధానం 140 కోట్లు (1.4 బిలియన్లు) అని ఒక వ్యక్తి చమత్కరించాడు.చాలా మంది సమాధానం తొమ్మిది అని చెప్పారు.
ఒక కుమార్తెతో సహా ఆరుగురు అన్నారు కాబట్టి మొత్తం ఆరుగురు కుమార్తెలు( Six Daughters ) అని, ప్రతి కూతురికి ఒక బ్రదర్ ఉంటాడని అని చెప్పారు కాబట్టి అతను వారందరికీ ఒకే సోదరుడు అని కొందరు లాజికల్‌గా ఆలోచించి సమాధానం 9 అని చెప్పారు.
మొత్తం పిల్లల సంఖ్య ఆరుగురు కుమార్తెలు + 1 కొడుకు = 7.తల్లిదండ్రులు తల్లి, తండ్రి.కాబట్టి, కుటుంబంలోని మొత్తం వ్యక్తుల సంఖ్య 7 మంది పిల్లలు + 2 తల్లిదండ్రులు = 9 అని చాలామంది బదులిచ్చారు.
అయితే, కొందరు మాత్రం ప్రశ్న తగినంత స్పష్టంగా లేదని, అది తప్పు ప్రశ్న అని, ప్రతి సోదరికి వేరే సోదరుడు ఉండవచ్చు, అంటే గరిష్టంగా 6 మంది సోదరులు ఉండవచ్చు.కాబట్టి, సమాధానం 9 నుంచి 15 వరకు ఎక్కడైనా ఉండవచ్చని అని అన్నాడు.
అయితే ఈ బ్రెయిన్ టీజర్‌కి సరైన సమాధానం తొమ్మిది అని చాలా మంది అంగీకరించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy