Harnidh Kaur Sodhi : వయస్సు 13.. డ్యాన్స్ చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో డ్యాన్స్ వీడియోల ద్వారా( Dance Videos ) ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న వాళ్లలో 13 సంవత్సరాల వయస్సు ఉన్న హర్నిద్ కౌర్ ఒకరు.

హర్నిద్( Harnidh Kaur Sodhi ) తన డ్యాన్స్ వీడియోలతో కోట్ల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

హర్నిద్ పంజాబీ కుటుంబంలో జన్మించగా ఆమె పేరెంట్స్ దుబాయ్ లో స్థిరపడ్డారు.తెలుగు హిట్ సాంగ్స్ కు కూడా అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ హర్నిద్ ఆకట్టుకుంటున్నారు.

ఆమె డ్యాన్స్ స్కిల్స్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.కఠినమైన డ్యాన్స్ స్టెప్పులను( Harnidh Kaur Sodhi Dance ) సైతం వేగంగా అవలీలగా చేసేస్తూ హర్నిద్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

చదువులో సైతం రాణిస్తూ 90 శాతం మార్కులను సాధిస్తూ హర్నిద్ కెరీర్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

దుబాయ్ లోనే పెరిగిన హర్నిద్ పంజాబీ, హిందీ భాషలను బాగా మాట్లాడగలరు.బాల్యం నుంచి హర్నిద్ కు డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండటంతో పేరెంట్స్ ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు.డ్యాన్స్ లో మెలుకువలు నేర్చుకున్న హర్నిద్ సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.

యూట్యూబ్ తో పాటు ఇన్ స్టాగ్రామ్( Harnidh Kaur Sodhi Instagram ) లో సైతం హర్నిద్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

హర్నిద్ ఒకవైపు డ్యాన్స్ వీడియోలు చేస్తూనే మరోవైపు మోటివేషనల్ స్పీకర్( Motivational Speaker ) గా కూడా రాణిస్తున్నారు.చదువు పూర్తైన తర్వాత బిజినెస్ లో రాణించడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తానని హర్నిద్ చెబుతున్నారు.సొంతంగా వీడియోలకు కొరియోగ్రఫీ( Choreography ) చేసుకుంటూ హర్నిద్ ఆకట్టుకుంటున్నారు.

హర్నిద్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి మరింత ఎక్కువమందికి స్పూర్తిగా నిలవాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.

వీడియో వైరల్ : అత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు.. ఎక్కడంటే..
Advertisement

తాజా వార్తలు