పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొదటిసారి పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా కోసం ఈయన చాలానే కష్టపడుతున్నాడు.
యాక్షన్ ఎపిసోడ్స్ చాలానే ఉండడంతో పవన్ కూడా ఫుల్ ఫోకస్ తో యాక్షన్ ఎపిసోడ్ లను పూర్తి చేస్తున్నాడు.మరి ఆ సినిమా ఏంటో ఇప్పటికే తెలిసింది కదా.అదే హరిహర వీరమల్లు.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
గత రెండేళ్ల నుండి షూటింగ్ జరుపు కుంటూనే ఉన్న మధ్యలో చాలా వాయిదాలు పడింది.దీంతో ఇప్పటికి షూట్ పూర్తి చేసుకోలేక పోయింది.
అయితే ఈ మధ్య క్రిష్ వేగంగానే షూట్ పూర్తి చేస్తున్నాడు.భారీ పాన్ ఇండియా మూవీగా అత్యుత్తమ సాంకేతిక విలువలతో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు గ్లిమ్స్ టీజర్స్, పోస్టర్ వంటివి రిలీజ్ అయ్యాయి.
ఈ అప్డేట్స్ అన్ని పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంటాయి.అయితే తాజాగా నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఈ అప్డేట్ పవన్ ఫ్యాన్స్ ను బాగా సంతోష పరిచింది.
ఈ సినిమా టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రాబోతుందని కన్ఫర్మ్ చేసారు.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.
ఇక ఏ ఎం రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ లాంటి పాత్రలో నటించ బోతున్నాడు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ అలాగే నర్గీస్ ఫక్రి కూడా ఈ సినిమాలో మెరవనున్నారు.
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎలాగైనా ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy