పవన్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ న్యూస్.. హరిహర వీరమల్లు విషయంలో జరగబోయేది ఇదేనా!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు.

( Hari Hara Veeramallu ) ఈ సినిమా అప్పుడెప్పుడో మొదలైంది.

కానీ ఈ సినిమా మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.అని అనుకున్నట్టు సజావుగా జరిగి ఉంటే ఈ సినిమా ఎలక్షన్ల కంటే ముందే విడుదల కావాల్సి ఉంది.

కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా ఫుల్ బిజీ బిజీగా ఉండడం ఆ తర్వాత ఎలక్షన్స్ లో గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడంతో ఫుల్ బిజీగా మారిపోయారు.దీంతో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగానే ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా ఈ ఏడాది మే 9న విడుదల కావాల్సి ఉంది.

Advertisement

కానీ ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా 70 శాతం వరకు షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది.

పవన్ అటు ఇటుగా ఒక వారం రోజులు డేట్స్ కేటాయిస్తే మొత్తం సినిమా కంప్లీట్ అయిపోతుందట.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్ ఈ నెలలో ఎలాగైనా వీరమల్లుకి కాస్త సమయం కేటాయించి, చిత్రాన్ని పూర్తి చేయాలని భావించారు.కానీ ఇప్పుడు అది సాధ్యపడకపోవచ్చు.

ఎందుకు అంటే తాజాగా సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్( Mark Shankar ) గాయపడిన సంగతి తెలిసిందే.దీంతో పవన్ సింగపూర్ కి వెళ్ళారు.

చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ పట్టేయడంతో మార్క్ కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

దీంతో పవన్ కొద్ది రోజులు సింగపూర్ లోనే ఉంటారని సమాచారం.అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీ అవుతారు.మే 9 కి సరిగ్గా నెలరోజులే సమయముంది.

Advertisement

ఒకవైపు ఆసుపత్రిలో కుమారుడు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు.ఇలాంటి సమయంలో పవన్ షూటింగ్ కోసం వారం రోజులు కేటాయించడం అసాధ్యమనే చెప్పాలి.

నిర్మాతలు సైతం ఈ సమయంలో పవన్ దగ్గర షూట్ ప్రస్తావన తీసుకొచ్చే అవకాశమే లేదు.ఈ లెక్కన మే 9కి వీరమల్లు వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.

దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ విషయంలో నిరాశ ఎదురయింది అని చెప్పాలి.దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అసలు విడుదల అవుతుందా లేదా అంటూ అభిమానులు కాస్త మండిపడుతున్నారు.

తాజా వార్తలు