యూఏఈకి చెన్నై సూపర్ కింగ్స్ ని మిస్ అవుతున్న హర్భజన్ సింగ్ కారణం..?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతీ యేడాది నిర్వహించే ఐపీఎల్ ఈసారి యూఏఈ వేదికగా జరుగనుంది.

సెప్టెంబర్ 19న మొదలవ్వనున్న ఐపీఎల్ మ్యాచ్ ల కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ తో కలిసి ఈవారం యూఏఈ కి బయలుదేరుతున్నాయి .

అయితే ధోని సారథ్యం వహించే సీఎస్కే టీమ్ మేనేజ్‌మెంట్ ఫ్యాన్స్ కు ఒక విచారకర వార్తను తెలియజేసింది.అదేంటో ఇప్పుడు చూద్దాం.

Harbhajan Singh Not To Travel With Chennai Super Kings Team, Chennai Super King

ప్రస్తుతం సీఎస్కే టీమ్ మేనేజ్‌మెంట్ తమ ప్లేయర్స్ తో కలిసి యూఏఈకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది.ఈ ట్రిప్ లో తమతో సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ రావట్లేదనే విషయాన్ని తెలియజేశారు.

హర్భజన్ సింగ్ సీఎస్కే ప్రాక్టీస్ సెషన్స్ కూడా గైర్హాజరైనట్లు సమాచారం.దీనితో ఫ్యాన్స్ హర్భజన్ సింగ్ ఎందుకు టీంతో పాటు ట్రావెల్ చేయట్లేదు.

Advertisement

ప్రాక్టీస్ సెషన్స్ కు ఎందుకు గైర్హాజరయ్యారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అసలు కారణం ఏంటంటే హర్భజన్ సింగ్ తల్లికి అస్వస్థతగా ఉంది.

ఆ కారణం చేతనే తను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ప్రాక్టిస్ సెషన్స్ కు హాజరు అవ్వలేదు.ప్రస్తుతం ఆ కారణంగానే తన ట్రిప్ ను కూడా వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు