చిరంజీవికి మెగాస్టార్ అని బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా?

భారత సినీ పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి మొదట్లో విలన్ పాత్రలో నటించే వారు.

ఈ క్రమంలోనే అతనిలో దాగిఉన్న నటుడిని గుర్తించిన కొందరు దర్శక నిర్మాతలు అతనికి హీరోగా అవకాశాలు ఇచ్చారు.ఈ క్రమంలోనే హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్న చిరంజీవికి, మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది? ఆ బిరుదు ఎవరు ఇచ్చారు అనే విషయానికి వస్తే.అప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న సమయంలో చిరంజీవిని హీరోగా తీసుకొని బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు నిర్మాత కె.ఎస్.రామారావు.చిరంజీవి హీరోగా కె.ఎస్.రామారావు నిర్మాణంలో, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం "అభిలాష".ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వీరి కాంబినేషన్లో చాలెంజ్, రాక్షసుడు వంటి చిత్రాలు కూడా తెరకెక్కాయి.

ఈ విధంగా ఇండస్ట్రీలో పలు అద్భుతమైన అవకాశాలు అందుకుంటూ సుప్రీం హీరోగా పేరుసంపాదించుకున్నారు చిరంజీవి.అయితే కె.ఎస్.రామారావు నిర్మాణంలో యండమూరి వీరేంద్రనాథ్ కథ ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మరణ మృదంగం".ఈ సినిమా విడుదల సమయంలో తెరపై పేర్లు పడుతుండగా చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని ఉండటంతో ప్రేక్షకుల కేకలు, ఈలలతో థియేటర్ దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు.

ఈ సినిమా కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇక అప్పటి నుంచి చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు వచ్చిందని నిర్మాత కెఎస్ రామారావు ద్వారా చిరంజీవి ఆ బిరుదును అందుకోవడంతో అప్పటినుంచి ఇప్పటివరకు చిరంజీవిని మెగాస్టార్ అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు.

Advertisement
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తాజా వార్తలు