జనసేనానిని కలిసిన హనుమంతన్న

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంత రావు అనూహ్యంగా జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ను ఆ పార్టీ హైదరాబాద్‌ కార్యలయంలో కలవడం జరిగింది.

వీరిద్దరి భేటికి గల కారణాలు ఏంటీ అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి సమాచారం లేదు.

కాని వీరిద్దరి భేటీ అనేది ఖచ్చితంగా రాజకీయ భేటీ అయ్యి ఉంటుందా అనే అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.గత కొంత కాలంగా కాంగ్రెస్‌లో సీనియర్లకు విలువ లేకుండా పోయిందని, సీనియర్లను పక్కన పెట్టి ఈమద్య వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారంటూ ఏకంగా పార్టీ అధినాయకత్వంపై నిప్పులు చెరిగాడు.

ఇలాంటి సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఆయన కలవడం పట్ల చర్చ మొదలైంది.తెలంగాణలో జనసేన పార్టీకి అడ్రస్‌ లేదు.

అలాంటి పార్టీలో వీహెచ్‌ కలుస్తాడా, తెలంగాణలో వీహెచ్‌ జనసేన కోసం పని చేస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.వీరిద్దరి కలయికకు కారణం ఏంటీ అనేది ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కాని తెలియాల్సి ఉంది.

Advertisement
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు