మంగళవారం నాడు జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చాయి.ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ( YSRCP Party ) ఘోర ఓటమిని చవిచూసింది.
2019లో 151 సీట్లు గెలిచిన వైఎస్ఆర్సిపి 2024లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది.ఇక తెలుగుదేశం కూటమి ఊహించిన దానికంటే ఎక్కువగా 164 స్థానాలలో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.
దీంతో మరోసారి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే.
ఇక టిడిపి కూటమికి అనేకమంది శుభాకాంక్షలు తెలుపుతుండగా.అందులో ఓ తెలుగు క్రికెటర్ కూడా చేరాడు.అయితే తన శుభాకాంక్షలు కాస్త వెరైటీగా పంచుకున్నాడు.
ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.కొద్దిరోజుల క్రితం పేరుగాంచిన తెలుగు క్రికెటర్ హనుమ విహారిని( Hanuma Vihari ) అప్పటి వైఎస్ఆర్సిపి రాజకీయ నాయకులు ఆయనను తెగ ఇబ్బంది పెట్టారు.
దీనికి కారణం లేకపోలేదు.ఈ నేపథ్యంలో టార్చర్ భరించలేని హనుమ విహారి ఆంధ్ర క్రికెట్ జట్టును( Andhra Cricket Team ) విడిచి పెట్టేందుకు సిద్ధమయ్యాడు.
దీనికి కారణం అప్పట్లో తన తోటి ఆడిగాడని క్రికెట్ సరిగా ఆడమని చెప్పినందుకు ఆ యువకుడు తన తండ్రి పార్టీ బలంతో అతడిపై చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నాడు.ఇక టీంను విడిచేందుకు సంబంధించి ఎన్ఓసి సర్టిఫికెట్( NOC Certificate ) కోసం రెండు నెలలుగా ప్రయత్నిస్తున్న విహారికి కేవలం ఒక్క రోజులోనే ఆ సర్టిఫికెట్ పొందడంతో ఆశ్చర్యపోయాడు.
ఇక ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవడంతో వెంటనే తనకు ఎన్ఓసి సర్టిఫికెట్ వచ్చిందంటూ విషయాన్ని తెలిపాడు.ఇక ఈ విషయం సంబంధించి సోషల్ మీడియాలో హనుమ విహారి వరుస ట్వీట్లు చేశారు.
రాష్ట్రంలో పరిస్థితులు మారాయి గత రెండు నెలలుగా దీనికోసం ఎంతో కష్టపడుతుండగా సోమవారం తనకి ఈ సర్టిఫికెట్ జారీ అయిందని చెప్పుకొచ్చాడు.రాష్ట్రంలో పరిస్థితులు మారిన నేపథ్యంలో తనకు ఇలాంటి అనుభవం ఎదురు కావడంతో అందుకు సంబంధించిన మెయిల్స్ స్క్రీన్ షాట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఏదేమైనా ప్రభుత్వాలు మారితే ఇలాంటి ఎన్ని సంఘటనలు మనం ముందు ముందు చూడగలమో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy