కడుపులో నొప్పి అని ఆసుపత్రికి వెళితే,స్కాన్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు

ఎదో కడుపులో నొప్పి వస్తే ఎవరైనా తిన్నది అరగలేదేమో అని అనుకుంటాం.ఇంకా నొప్పి వస్తే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని టాబ్లెట్ తో సరిపెడతాం.

ఇక అదే పనిగా నొప్పి వస్తూ ఉంటే డాక్టర్ వద్దకు వెళతాం,ఇక అక్కడ ఆ టెస్ట్ లు ఈ టెస్ట్ లు చేసి అసలు నొప్పి కి కారణం ఏంటి అనేది కనుక్కుంటారు అదే వేరే విషయం.అయితే ఇలానే ఒక బాలిక కడుపులో నొప్పి అని బాధపడుతూ ఉంటే అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని డాక్టర్ దగ్గరకి వెళ్లగా దిగ్బ్రాంతి కలిగించే విషయం బయటపడింది.

ఆ బాలిక కడుపులో అరకేజీ జుట్టు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.ఈ ఘటన తమిళనాడు లోని కోయంబత్తూరు లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.కోయంబత్తూరు కు చెందిన 13 ఏళ్ల బాలిక ప్రతిరోజూ కడుపునొప్పి తో బాధపడేది.

Advertisement
Abdominal Pain,doctors Were Surprised Doctors Were Surprised,Hair And Shampoo C

దీంతో పేరెంట్స్ దగ్గర్లోని వీజీఎమ్ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు స్కాన్ చేసి చూడగా లోపల ఏదో నల్లటి పదార్ధం కడుపులో ఉందని గుర్తించారు.కానీ అదేంటన్నది అర్ధం కాలేదు.

Abdominal Pain,doctors Were Surprised Doctors Were Surprised,hair And Shampoo C

వెంటనే ఆపరేషన్ చేయగా.బాలిక కడుపలో అరకేజీ జుట్టు దర్శనమిచ్చింది.జుట్టు మాత్రమే కాదు షాంపూ పాకెట్లు, ఇంకొన్ని ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉండడం గమనార్హం.

వాటన్నింటిని తొలగించిన వైద్యులు ఆమెకు బెడ్ రెస్ట్ సజిస్ట్ చేశారు.అయితే తమ కుమార్తె మానసిక వ్యాధితో బాధపడుతోందని అందుకే ఇలా చేసి ఉండొచ్చని ఆ బాలిక తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.

హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే ఇలా ఈజీగా ఫేషియ‌ల్ చేసుకోండి!
Advertisement

తాజా వార్తలు