త్వరలోనే గుడ్ న్యూస్... ప్రియుడితో అలాంటి ఫోటోని షేర్ చేసిన నటి జ్యోతి రాయ్!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్( Guppedantha Manasu ) లో జగతి మేడం పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో నటి జ్యోతి రాయ్( Jyothi Rai ) ఒకరు.ఈ సీరియల్ లో ఈమె తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Guppedantha Manasu Jagathi Jyothi Rai Confirms Relationship With Director Suku P-TeluguStop.com

ఇక తెలుగులో ఈమెకు మొదటి సీరియల్ అయినప్పటికీ కన్నడలో మాత్రం దాదాపు 20 సీరియల్స్ లో నటించడమే కాకుండా సినిమాలు కూడా నటిస్తు నటిగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సాంప్రదాయానికి మారుపేరుగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

Telugu Suku Purvaj, Jyothi Rai, Jyothirai-Latest News - Telugu

సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కనిపించే జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం భారీ ఎక్స్పోజ్ చేస్తూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.అదేవిధంగా ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి మరొక యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.దీంతో ఒక్కసారిగా ఈమె ఫేమస్ అయిపోయారు.ఇలా యంగ్ డైరెక్టర్ సుఖ పూర్వజ్ ( Suku Purvaj ) వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు రావడంతో వీరి గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది.

Telugu Suku Purvaj, Jyothi Rai, Jyothirai-Latest News - Telugu

ఇలా ఈ వార్తలకు అనుకూలంగానే ఈమె కూడా తన ట్విట్టర్ యూజర్ నేమ్( Jyothi Rai Twitter Username ) లో డైరెక్టర్ పేరును జోడించడంతో వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారు అంటూ అందరికి క్లారిటీ వచ్చింది.అయితే తాజాగా జ్యోతి రాయ్ డైరెక్టర్ సుఖ పూర్వజ్ తో కలిసి చాలా చనువుగా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఇలా గుడ్ న్యూస్ అంటూ ఈ ఫోటోని షేర్ చేయడంతో నేటిజన్స్ వీరిద్దరూ పెళ్లి కానీ చేసుకోబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే మరి కొందరు మాత్రం ఏదైనా సినిమాలు కూడా ప్రకటించవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి త్వరలోనే ఈమె ఎలాంటి గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube