Tamanna Vijay Varma: తమన్నా, విజయ్ రిలేషన్ పై అలాంటి కామెంట్స్ చేసిన నటుడు.. నా తమన్నాతో తిరుగుతున్నావా అంటూ?

హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా( Tamanna ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా తమన్నా విజయ్ వర్మ కి ( Vijay Varma ) ముద్దులు పెట్టిన విషయం తెలిసిందే.దాంతో అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, గత కొంతకాలంగా వీరు ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

దానికి తోడు వీరిద్దరూ పలుసార్లు విమానాశ్రయంలో కలిసి కనిపించడంతో ఆ వార్తలతో మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.తాజాగా మరోసారి ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కనిపించారు.

దీంతో మిల్కీ బ్యూటీ, విజయ్ వర్మ డేటింగ్ రూమర్స్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలపై ఇటు విజయవర్మ కానీ అటు తమన్న కానీ స్పందించడం లేదు.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి విజయవర్మ ఫ్రెండ్ నటుడు గుల్షన్ దేవయ్య( Gulshan Devaiah ) ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాజాగా విజయ్ వర్మ తన ఇంస్టాగ్రామ్ లో దహాద్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్ టీజర్‌ను పోస్ట్ చేశారు.ఈ టీజర్ చూసిన గుల్షన్‌ తమన్నాతో విజయ్ వర్మ డేటింగ్‌పై ఫన్నీగా పోస్ట్ చేశారు.ఈ సందర్బంగా గుల్షన్ తన కామెంట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు.

తమన్నాతో నువ్వు తిరుగుతున్నావ్.నాకు సరైన బుద్ధి చెప్పావ్ విజయ్.

ఇంకా నా పరువు తీయనందుకు నీకు చాలా థ్యాంక్స్.లేకపోతే ఏం జరిగేదో.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

హే రామ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు గుల్షన్.

Advertisement

అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.ఇకపోతే తమన్నా, విజయ్ వర్మ మొదటిసారిగా లస్ట్ స్టోరీస్ 2 సినిమాలో కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే తమన్నా విషయానికి వస్తే తమన్నా ప్రస్తుతం తమిళం హిందీ తెలుగు భాషల్లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

సినిమాలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటిస్తూ, మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ దూసుకుపోతోంది.

తాజా వార్తలు