ఒకప్పటి సీనియర్ హీరోయిన్ కస్తూరి ( Kasthuri ) అంటే అప్పట్లో అంతగా గుర్తింపు ఉండేది కాదు.కానీ ఇప్పుడు ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా లో ప్రసారమయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంచి గుర్తింపు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఈమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో నన్ను ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు గుర్తుపడ్తున్నారని,గృహలక్ష్మి తులసి ( Gruhalakshmi Thulasi ) అంటూ ప్రతి ఒక్కరు నాతో ఫొటోస్ దిగుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది.అయితే తాజాగా నేను తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాను అంటూ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది నటి కస్తూరి.
మరి ఇంతకీ ఏ పార్టీ నుండి కస్తూరి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.నిజంగానే రాజకీయాల్లోకి రాబోతుందా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది.

ఇక ఇలాంటి సమయంలో ఇంటింటి గృహలక్ష్మి ( Intinti Gruhalakshmi ) సీరియల్ నటి కస్తూరి నేను తెలంగాణ రాజకీయాల్లోకి రాబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ.గృహలక్ష్మి సీరియల్ ద్వారా నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది.
ఇక ఈ గుర్తింపు నా పొలిటికల్ కెరీర్ కి కూడా ఉపయోగపడుతుందని నేను అస్సలు అనుకోలేదు.నేను రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్నానంటే దానికి కారణం గృహలక్ష్మి సీరియల్.
అలాగే నేను తెలంగాణ రాజకీయాల్లో తొలిసారి అడుగుపెట్టబోతున్నాను.

చాలామంది ఆడవాళ్లు నేను ఎక్కడ కనిపించినా కూడా నా దగ్గరికి వచ్చి ఫోటోలు దిగడమే కాదు వారికి సంబంధించిన సమస్యలు కూడా నాతో పంచుకుంటున్నారు.మిగతా భాషల్లో నేను గ్లామర్ రోల్స్ చేసినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అన్ని సాంప్రదాయమైన పాత్రల్లోనే నటించాను.ఈ గృహలక్ష్మి సీరియల్ ద్వారా నన్ను ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిగా.
చెల్లిగా.అక్కగా.
భావిస్తున్నారు.వారు నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో నేను కళ్లారా చూస్తున్నాను.
అందుకే తెలంగాణ రాజకీయాల్లో ( Telangana Politics ) కి అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాను అంటూ కస్తూరి శంకర్ తన మనసులో ఉన్న మాటని బయటపెట్టింది.దీంతో కస్తూరి శంకర్ నిజంగానే రాజకీయాల్లోకి అడుగు పెడుతుందని అందరూ భావిస్తున్నారు.
మరి చూడాలి కస్తూరి శంకర్ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీలో చేరుతుందో.