అవి తింటే డయాబెటిస్ ఇట్టే తగ్గిపోతుందట!

పచ్చిమిర్చి ఈ పేరు వింటేనే నోట్లో నీరు వచ్చేస్తాయి.అలాంటిది తింటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి.

అంతటి ఘాటుగా ఉండే పచ్చిమిర్చి వల్ల లాభాలా? అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.అయితే పచ్చి మిర్చి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Health Benefits Of Eating Green Chilies, Vitamin D, Green Chilies,Diabetes, BP C

పూర్వం మన పెద్దవారు పెరుగన్నంలోకి మిర్చిని ఎంతో ఇష్టంగా తినే వారు.అంతేకాకుండా అప్పట్లో ఎక్కువగా పచ్చిమిర్చి ఉపయోగించి చేసే చట్నీలను తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.

వాళ్లకు షుగర్, బిపి అనే వ్యాధుల గురించి అసలు తెలియదు.కానీ ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ప్రతి ఒక్కరు కూడా మధుమేహంతో బాధపడుతున్న.అలాంటివారికి పచ్చిమిర్చితో ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Advertisement

పచ్చిమిర్చిని మనం తరచు వంటలకు వాడే ఒక కూరగాయలలో ఒకటి.ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, యాంటీ బ్యాక్టీరియల్, బీటా-కెరోటిన్ పోషక విలువలు ఉన్నాయి.

పచ్చి మిర్చిలో జీరో క్యాలరీస్ ఉండడంవల్ల అధిక బరువు పెరగడం వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.అంతేకాకుండా మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి ఎటువంటి గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది.

పచ్చి మిర్చి లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల, క్యాన్సర్ కణాలతో పోరాడి, వాటిని నాశనం చేయడానికి దోహదపడతాయి.అంతేకాకుండా మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ నుంచి మనల్ని కాపాడుతాయి.

ఇందులో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల ఎటువంటి గాయాలు తగిలినప్పుడు కలిగే అధిక రక్తస్రావం నుంచి మనల్ని రక్షిస్తుంది.పచ్చిమిరపకాయలు తగినంత పరిమాణంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని అధికం చేస్తుంది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల మన శరీరంలో అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.అందువల్ల మధుమేహంతో బాధపడేవారు తరచూ పచ్చిమిరపకాయలను తగినంత పరిమాణంలో మాత్రమే వాడాలి.

Advertisement

తాజా వార్తలు