దక్షిణాఫ్రికా: భారతీయులపై దాడులు, దుకాణాలు లూటీ.. రంగంలోకి విదేశాంగ శాఖ

దక్షిణాఫ్రికా ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది.

కోర్టు ధిక్కరణ కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా జైలుకు వెళ్లడంతో ఆయన మద్దతుదారులు, ప్రజలు బీభత్సం సృష్టిస్తున్నారు.

భద్రతా దళాలు-ఆందోళనకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలతో వీధులన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి.ఇక నిరసనల ముసుగులో ప్రజలు దుకాణాలపై దాడులకు పాల్పడి అందినకాడికి దోచుకుంటున్నారు.

ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులతోపాటు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ 72 మంది మరణించారని, 1,234 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

అయితే దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారతీయులను స్థానికులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.అక్కడ సుమారు 20 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.

Advertisement
Govt Raises Concerns Over Attacks On Indians In South Africa As Violence Spreads

ఈ స్థాయిలో అల్లర్లు జరుగుతున్నా.ఇక్కడి తమకు భారత రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి సహకారం అందటంలేదని భారతీయులు ఆరోపిస్తున్నారు.

తాము పడుతున్న ఇబ్బందులను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలేడి పసండోర్‌ దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.

భారతీయులు పడుతున్న ఇబ్బందులపై ఆయన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలేడి పాండర్‌తో మాట్లాడారు.అలాగే భారత విదేశాంగ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య.

భారత్‌లోని దక్షిణాఫ్రికా హైకమీషనర్ జోయెల్ సిబుసిసోను కలిశారు.త్వరలోనే పరిస్ధితులు అదుపులోకి వస్తాయని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.

Govt Raises Concerns Over Attacks On Indians In South Africa As Violence Spreads
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

కాగా, క్వాజులు, నాటాల్, జోహన్నెస్‌బర్గ్‌లలో స్థిరపడిన భారతీయులను స్థానికులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు.ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.తక్షణం తమకు రక్షణగా భద్రతా దళాలను పంపాల్సిందిగా వారు కోరుతున్నారు.

Advertisement

కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని వారు వాపోతున్నారు.పలు చోట్ల భారతీయులకు చెందిన దుకాణాలను స్థానికులు లూటీ చేస్తున్నట్లుగా తెలిపారు.

దుకాణాలను, ఇళ్లను కాల్చి వేయడంతో పాటు పెట్రోల్ బాంబులు విసురుతున్నారని.దీంతో మహిళలు, పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

తాజా వార్తలు