ఈ హాస్యనటుడు ఒక నటి కి ఇంత అన్యాయం చేశాడా..?

గౌండమణి.ఈ నటుడు పేరు మన తెలుగు ప్రేక్షకులు పెద్దగా పరిచయం లేదు కాని తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా కమెడియన్ గా కొంత తెలుసు.

ఈ నటుడి వయసు ప్రస్తుతం 82 ఏళ్ళు.ప్రస్తుతానికి ఫెడ్ అవుట్ అయినా ఈ నటుడు సినిమాల్లో పెద్దగా నటించడం లేదు.

ఆరోగ్యం సహకరించకపోవడం తో సినిమాలు మానేసాడు.కాని రజిని కాంత్ తో ఎక్కువగా నవ్వులు పూయించే సన్నివేశాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరొక కమెడియన్ సెంథిల్ తో బాగా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు గౌండమణి.వీరి జంట టీవిలో కనిపిస్తే చాలు నవ్వు ఆపుకోరు ఇప్పటికి జనాలు.

Advertisement
Goundamani Worst Behavior Towards Actress Radhabhai Details, Goundamani, Tamil C

ఇక అసలు విషయంలోకి వెళితే గౌండమణి జీవితంలో అనేక కాంట్రావర్సీ లు ఉన్నాయి.బయట ప్రపంచానికి తెలిసి కొన్ని ఉంటె, తెలియనివి అనేకం ఉన్నాయ్.

అందులో ఒకటి ఒక తమిళ తోటి నటిని ఇబ్బంది పెట్టడం.ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీకందరికి తమిళ నటి పద్మిని గుర్తుండే ఉంటుంది.ఆమె తల్లి కూడా మనందరికి తెలిసిన నటి.ఆమె పేరు రాధాబాయి.జెంటిల్ మ్యాన్ సినిమాలో బామ్మా పాత్రలో మనం ఈ నటీమణిని చూస్తే గుర్తు పడతాం.

రాధాబాయి తన కూతురిని హీరోయిన్ చేయాలనుకున్న అది సాధ్యం కాలేదు.చివరికి రాధాబాయి కూతురు పద్మిని ప్రేమించి ఇంట్లో వాళ్ళని వదిలేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

ఆలా రాధాబాయి తన జీవితంలో చాల ఇబ్బంది పడింది.

Goundamani Worst Behavior Towards Actress Radhabhai Details, Goundamani, Tamil C
Advertisement

ఇక రాధాబాయి ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో చనిపోయినట్టు నటించాలి.ఆమెను పాడే పైన పడుకోబెట్టుకుని తీసుకెళ్తారు.ఆలా తీసుకెళ్లే వ్యక్తుల్లో తమిళ హాస్యనటుడు గౌండమణి కూడా ఉంటాడు.

అయితే గౌండమణి సరిగ్గా పాడే పెట్టుకోకుండా రాధాబాయి ని కింద పడేసాడు.ఆలా కింద పడే సమయంలో ఆమె తలకు గాయం అయ్యి చాలా రక్తం పోయింది.

ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో రాధాబాయి ని గౌండమణి చాలా ఇబ్బంది పెట్టాడట.

కనీసం అతడి వాళ్ళ దెబ్బ తగిలితే ఎలాంటి సహాయం చేయకపోగా, షూటింగ్ ఒక పల్లెటూర్లో జరగడం తో ఆలా రక్తం తోనే మద్రాసు వరకు వెళ్లిందట.ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె మరణించింది.అలా ఒక నటిని ఇబ్బంది పెట్టిన గౌండమణి గురించి ఇండస్ట్రీ అంత కూడా మాట్లాడుకున్నారు.

అంత పెద్ద వయసు ఉన్న నటికి గౌండమణి ఎలాంటి మర్యాద కూడా ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం.

తాజా వార్తలు