ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు అందరు మంచి గుర్తింపును సంపాదించుకుంటుంటే మ్యాచో స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్( Gopichand ) కూడా సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న వరుస సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటుగా ఇండస్ట్రీలో ఇప్పటికే ఆయన స్టార్ హీరోగా తనకంటూ పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈయన కెరియర్ మొదట్లో మొహమాటానికి పోయి చాలా సినిమాలు చేసి వాటిని భారీ డిజాస్టర్లుగా చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ముఖ్యంగా ఏఎస్ రవికుమార్ చౌదరి( AS Ravikumar Chaudhary ) డైరెక్షన్ లో చేసిన సౌఖ్యం అనే సినిమా చేసి ఆ సినిమాతో ఫ్లాప్ ను అందుకున్నాడు.నిజానికి ఈ సినిమా స్టోరీ ఆయనకి అంత నచ్చనప్పటికీ తనకు ఇంతకుముందు యజ్ఞం( Yajnam ) అనే సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు కాబట్టి ఆయన డైరెక్షన్ లో ఈ సినిమా చేయాల్సి వచ్చింది.అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు.
ఇక లౌక్యం( Laukyam ) సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న గోపీచంద్ కి ఈ సినిమాతో భారీ డిజాస్టర్ వచ్చింది… ఇక బి వి ఎస్ రవి దర్శకత్వంలో వచ్చిన వాంటెడ్ సినిమా కూడా గోపీచంద్ కి ఇష్టం లేకపోయిన పూరి జగన్నాథ్( Puri Jagannath ) రికమెండేషన్ తో బి వి ఎస్ రవి( BVS Ravi ) గోపీచంద్ తో ఈ సినిమా చేయడానికి ఓకే అయ్యాడు.
ఎందుకంటే పూరి అంతకుముందే గోపీచంద్ కి గోలీమార్ అనే ఒక సూపర్ సక్సెస్ సినిమాని ఇచ్చాడు.కాబట్టి మొహమాటానికి పోయి ఈ సినిమా చేసి ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు… ఇక అప్పటి నుంచి జ్ఞానోదయం అయిన గోపిచంద్ స్టోరీ వినేసి అది నచ్చి డైరెక్టర్ మీద నమ్మకం వచ్చిన తర్వాతే సినిమాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు.