మోసపూరితమైన, హానికరమైన యాప్స్ ద్వారా మొబైల్ యూజర్ల డబ్బులను తస్కరించేందుకు కొత్త హ్యాకర్లుపంథాలను ఎంచుకుంటున్నారు.ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ చాలామంది వినియోగదారుల డబ్బులను ఈజీగా కొట్టేస్తున్నారు.
జాగ్రత్త వహించకపోతే ఈ హ్యాకర్లు వలలో మనం కూడా పడే ప్రమాదం ఉంది.ఇందులో భాగంగానే హానికరమైన యాప్స్ నుంచి యూజర్లకు మెరుగైన భద్రత కల్పించడం కోసం 12లక్షల యాప్ లను నిషేధించినట్లు గూగుల్ ప్రకటించింది.
జనాల్ని దోచుకు తింటున్న యాప్‌లూ ఎన్నో ఉన్నాయి.వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది గూగుల్ సంస్థ.
పాలసీలకు విరుద్ధంగా ఉన్న యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు వెల్లడించింది.తమ యూజర్ల భద్రత దృష్ట్యా 2021లో మోసపూరితంగా ఉన్న 12 లక్షల యాప్స్ ను నిషేధించింది.అంతేకాకుండా 2021లో మోసపూరిత, స్పామ్ డెవలపర్ లను నియంత్రించడానికి 1.90 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది.దీంతోపాటు ఇన్ యాక్టివ్ గా ఉన్న దాదాపు ఐదు లక్షల ఖాతాలను నిలిపివేసినట్లు గూగుల్ నివేదించింది.
మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయాక, వివిధ పేర్లతో కొత్త కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి.
యూజర్ల సమాచారాన్ని దొంగిలించి మోసాలకు పాల్పడేవారి సంఖ్య బాగా పెరిగింది.ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్నా.వివిధ పేర్లతో పుట్టుకొస్తూనే ఉన్నాయి.వాటి విషయంలో వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైరస్, మాల్వేర్ ఇతర సమస్యలు ఉన్నప్పుడు గూగుల్ కొన్ని యాప్స్ ను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే యూజర్ల భద్రతా కారణాల దృష్ట్యా వీటిని నిషేధించినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్టులో వివరించింది.

సెర్చ్ దిగ్గజం గూగుల్ యూజర్ల డేటా సేఫ్టీ కోసం మే నెలలో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది.యాపిల్ గోప్యత విభాగం ‘న్యూట్రిషన్ లేబుల్స్’ తరహాలోనే ఇది పనిచేస్తుంది.దీనిలో గూగుల్ ప్లే స్టోర్ లోని యాప్స్ లో గోప్యత, భద్రతా హక్కులకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.ఇదిలా ఉండగా… నిషేధిత యాప్లు ఇంకా మీ ఫోన్లో ఉన్నాయో, లేదో తెలుసుకోవాలంటే గూగుల్, యాప్ స్టోర్ లోకి వెళ్లి యాప్ లో వివరాలు సరిచేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
వాటిలో కనిపించినట్లైతే అవి నిషఏధిత యాప్ లు కాదని చెబుతున్నారు.ప్లే స్టోర్ లలో కనిపించకపోతే మొబైల్ నుంచి ఆ యాప్ ను వెంటనే డిలీట్ చేయాలి అని హెచ్చరిస్తున్నారు.







