Google Safe Browsing : గూగుల్ క్రోమ్ లో కొత్తగా సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్.. సైబర్ అటాక్ లకు బ్రేక్..!

ఒకపక్క టెక్నాలజీ( Technology ) వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే.

మరోపక్క అదే టెక్నాలజీ ఉపయోగించి అమాయక ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది.

గూగుల్ తన క్రోమ్ యూజర్ల( Google Chrome users ) భద్రత కోసం, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండడం కోసం ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ తో మాల్వేర్ అటాక్ సైబర్ అటాక్ల( Cyber Attacks ) బారిన పడకుండా క్రోమ్ యూజర్లకు ఈ ఫీచర్ అప్రమత్తం చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్( Safe Browsing Feature ) అనేది ప్రధానంగా ఫిషింగ్స్, మాల్వేర్ అటాక్ లపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.క్రోమ్ యూజర్లు పొరపాటున సైబర్ నేరగాళ్ల వెబ్సైట్ ను సందర్శిస్తే వెంటనే ఈ ఫీచర్ అప్రమత్తం చేస్తుంది.టెస్టింగ్ దశలో భాగంగా ఈ ఫీచర్ 25% ఫిషింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు గూగుల్ తెలిపింది.

Advertisement

గూగుల్ సంస్థ తన ట్రాకింగ్ మెకానిజాన్ని( Tracking Mechanism ) రియల్ టైం ఫంక్షన్ తో అనుసంధానం చేసింది.దీంతో రియల్ టైం ట్రాకింగ్ మెరుగ్గా పనిచేస్తుందని గూగుల్ భావిస్తోంది.

క్రోమ్ యూజర్లు గూగుల్లో ఏదైనా ఒక వెబ్సైట్ సందర్శించినప్పుడు క్యాచీ ఆధారంగా వెబ్సైట్ భద్రతను ఈ ఫీచర్ టెస్టింగ్ చేస్తుంది.

ఆ వెబ్సైట్ URL ను ప్రైవసీ సర్వర్( Privacy Server ) కు పంపించి రియల్ టైం లోను భద్రతను పర్యవేక్షిస్తుంది.బ్యాక్ గ్రౌండ్ లో వెబ్సైట్ భద్రతను గూగుల్ తనిఖీ చేసి, ఏవైనా భద్రతా లోపాలు గుర్తిస్తే వెంటనే యూజర్లకు అప్రమత్తం చేస్తుంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సైబర్ నేరగాళ్ల నేరాలకు చెక్ పెట్టినట్టే.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు