స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త... కళ్లుచెదిరే ఫీచర్లతో 9 కొత్త స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లోకి!

కొత్త స్మార్ట్ ఫోన్( Smart phone ) కొనాలని అనుకున్నవారికి శుభవార్త.వచ్చే నెలలోనే అనేక రకాల కొత్త స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లోకి దర్శనం ఇవ్వబోతున్నాయి.

 Good News For Smartphone Lovers 9 New Smartphones With Eye-catching Features In-TeluguStop.com

షావోమి( Xiaomi ) దగ్గరి నుంచి వివో వరకు పలు కంపెనీలు కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేయనున్నాయి.కాబట్టి కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావించేవారికి ఇది శుభతరుణం అని చెప్పుకోకతప్పదు.

ఇపుడు షావోమి కంపెనీ “రెడ్‌మి నోట్ 12”( Redmi Note 12 ) టర్బో ఫోన్‌ను లాంచ్ చేయనుంది.8 జీబీ ర్యామ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా మరెన్నో ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ ధర కేవలం రూ.23,990 మాత్రమే.అదేకాకుండా “షావోమి 13”( “Xiaomi 13” ) స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ కాబోతోంది.8 జీబీ ర్యామ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాతో ఇది వస్తోంది.కాగా ధర రూ.47,390గా ఉండొచ్చని చెబుతున్నారు.అదేవిధంగా “రియల్‌మి 11 ప్రో ప్లస్” ( Realme 11 Pro Plus )ఫోన్ కూడా రాబోతోంది.దీని ధర రూ.24,890 మాత్రమే.

ఇక “రియల్‌మి జీటీ నియో 5”( Realme GT Neo 5 ) 5జీ ఫోన్ విషయానికొస్తే, ఇందులో 8 జీబీ ర్యామ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది.ధర విషయానికొస్తే రూ.31,690గా ఉండొచ్చని భోగట్టా.మోటరోలా ప్రియులకోసం ఇపుడు “ఎడ్జ్ 40 ప్రో” 5జీ ఫోన్ మార్కెటలోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.దీని ధర మాత్రం రూ.80,930గా ఉండొచ్చని వినికిడి.అదేవిధంగా….శాంసంగ్ గెలాక్సీ ఎం54 ఫోన్, ఒప్పొ రెనో 9 స్మార్ట్‌ఫోన్, ఒప్పొ రెనో 10 ప్రో ప్లస్ ఫోన్లు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి.

వీటన్నిటిలో దాదాపుగా 16 జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లను వుంటాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube