కేంద్ర ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు.. కారణం అదే!

కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంత ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వల్ల ప్రపంచమంతా కొన్ని నెలల పాటు ఆగిపోయింది.

ఈ కరోనా కాలం వల్ల ఎంతోమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.ప్రస్తుతం మెల్లగా కోలుకుంటూ వస్తున్నారు.

Salaries Of Central Govt Employees May Rise In 2021, Salary Hike. Dearness Allow

అయితే కరోనా లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడ్డారు.సగం జీతాలతోనే జీవితాన్ని నెట్టుకొచ్చారు.

అష్టకష్టాలు పడ్డారు.ఇక ఈ నేపథ్యంలోనే వారి కష్ఠాలను తీర్చేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు పెరగనున్నాయ్.

Advertisement

కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు ఈ శుభవార్త చెప్పింది.వారి పెన్షన్లను పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

వచ్చే ఏడాది 7 వ వేతన కమిషన్ సిఫార్సులు మేరకు ఉద్యోగుల డీఏ పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇక ఉద్యోగులకు కూడా నాలుగు శాతం డీఏ పెంచేందుకు కేంద్ర ప్రభుతం ఆమోదం తెలిపింది.

అంతేకాదు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆపేసిన ఏప్రిల్ డీఏను కూడా పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయించింది.ఇక దీని వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు 60 లక్షల మందికి పైగా పింఛన్ దారులు లబ్ధి పొందనున్నారు.

ఉద్యోగులకు ప్రస్తుతం కేంద్రం 17 శాతం డీఏ ఇస్తోంది.నిజానికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే డీఏ పెంపును కేంద్ర ప్రభుతం చెయ్యాల్సి ఉంది.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

కానీ వచ్చే జులై వరకు ఆంక్షలు విధిస్తు ఆదేశాలు ఇచ్చింది.ఇప్పుడు కేంద్రం ఏటా రెండు సార్లు డీఏ పెంచనున్నట్టు జనవరి లో కేంద్రం ముందుకు డీఏ పెంపు ప్రతిపాదన చెయ్యాలని నిర్ణయించారు.

Advertisement

ఏది ఏమైనా కేంద్ర ఉద్యోగుల పెన్షనర్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి.

తాజా వార్తలు