ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. పండగ వేళ ఉచితంగా డేటా!

Airtel తన కస్టమర్లకు పండుగ ముందే ఓ పండగలాంటి వార్త తీసుకువచ్చింది.ఇది వారికి ఒక స్పెషల్ గిఫ్ట్ లాంటిది అన్నమాట.

 Good News For Airtel Users.. Free Data During Festival, Airtel, Sim,good News,-TeluguStop.com

అవును, ప్రిపెయిడ్ కస్టమర్లకు ఉచితంగా 5 జీబీ డేటాను అందిస్తోంది.అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు సుమా.

ఎవరైతే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, రిజిస్టర్ చేసుకుంటారో వారికే ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది.ఆ మాత్రం నియమ నిబంధనలు లేకుండా ఉచితంగా ఏమి రావు.

ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఈ యాప్ ద్వారా పలు రకాల సేవలు పొందొచ్చు.

అయితే ఇక్కడ 5జీ డేటా ఒకేసారి రాదండోయ్.ఇక్కడ కూడా ఫిట్టింగ్ వుంది.ఈ 5జీ డేటా అనేది 5 కూపన్ల రూపంలో వస్తుంది.ఒక్కో కూపన్‌లో 1 జీబీ డేటా వస్తుంది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, బిల్ పేమెంట్స్, ప్లాన్ మార్చుకోవడం ఇంకా ఇతర సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.కొత్తగా ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్ సిమ్ కార్డు కొన్న వారు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే వారికి ఈ 5జీజీ డేటా 5 కూపన్ల రూపంలో లభిస్తుందన్నమాట.

రిజిస్టర్ చేసుకున్న తర్వాత కస్టమర్లు కూపన్ సెక్షన్‌లోకి వెళ్లి ఈ ఉచిత డేటాను పొందొచ్చు.

Telugu Airtel, Airtelfestival, Ups-Latest News - Telugu

యూజర్లు ఈ డేటా వోచర్లను 90 రోజుల లోగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.లేదంటే అవి ఎక్స్‌పైర్ అవుతాయి అని గుర్తుపెట్టుకోండి.అంతేకాకుండా ఎయిర్‌టెల్ యూజర్లుకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా వుంది.రెఫరల్ మీద రూ.100 గెలుచుకోవచ్చు.ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్ సిమ్ రెఫరల్ లింక్‌ను స్నేహితులకు పంపొచ్చు.అందువల్ల మీరు కూడా ఎయిర్‌టెల్ సిమ్ కార్డు తీసుకొని ఉంటే.వెంటనే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube