టీబీ వ్యాధి ఉన్న‌వారు ఖ‌చ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవే?

టీబీ.దీనిని క్షయ వ్యాధి అని కూడా అంటారు.

మనిషిని నిలువెల్లా దహించివేసే ఈ అంటు వ్యాధి చాలా ప్రాణాంత‌క‌మైన‌ది.

ముఖ్యంగా మన ఇండియాలోనే టీబీ వ్యాధి బాధితులు అత్య‌ధికంగా ఉన్నారు.

అయితే చాలా మంది ఈ వ్యాధిని నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.ఆ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే.

టీబీ వ్యాధి ఎంత బ‌ల‌వంతుడినైనా పిల్చి పిప్పి చేసేస్తుంది.టీడీ వ్యాధి ఉన్న వారికి నాన్ స్టాప్ ద‌గ్గు వ‌స్తూనే ఉంటుంది.

Advertisement
Good Food For Fast Recovering From Tb Disease! Good Food, Tb Disease, Health Tip

అలాగే త‌ర‌చూ జ్వ‌రం, శ‌రీరం అంతా చ‌మ‌ట‌లు ప‌ట్ట‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపింస్తాయి.మ‌రియు ఉన్న‌ట్టు ఉంది బ‌రువు త‌గ్గిపోవ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం కూడా టీడీ ల‌క్ష‌ణాలుగా చెప్పుకొచ్చు.

ఇక ఇమ్యూనిటీ ప‌వ‌ర్ తక్కువగా ఉండేవారికి ఈ వ్యాధి త్వరగా సంక్రమిస్తుంది.అయితే మొద‌టి ద‌శ‌లో ఉన్న‌ప్పుడే ఈ వ్యాధి గుర్తించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే త్వ‌ర‌గా రిక‌వ‌ర్ అవ్వొచ్చు.

అలా కాకుండా.ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాన్ని కోల్పోవాల్సి వ‌స్తుంది.

ఇక ఈ అంటు వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.వైద్యులు సూచించిన మందులు రెగ్యుల‌ర్‌గా వేసుకోవ‌డంతో పాటు ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి.

న్యూస్ రౌండప్ టాప్ 20

యాంటీ ఇన్ఫ్లమేటరీ మ‌రియు యాంటా ఆక్సిడెంట్లు క‌లిగి ఉండే వెల్లుల్లి టీవీ వ్యాధిని త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Good Food For Fast Recovering From Tb Disease Good Food, Tb Disease, Health Tip
Advertisement

కొన్ని వె‌ల్లుల్లి రెబ్బ‌ల‌ను దంచి పాల‌లో వేసి మ‌రిగించి.ప్ర‌తి రోజు ప‌ర‌గ‌డుపున సేవించాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల టీడీ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

అలాగే మునగాకు కూడా టీడీని నివారించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.నీటిలో మున‌గాకు, మిరియాల పొడి వేసి మ‌రిగించి.

అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం యాడ్ చేసి సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇక పాల‌కూర‌, బచ్చలికూర, క్యారెట్లు, బీట్‌రూట్లు, టమోటాలు, నారింజ, బ్లూబెర్రీస్, చెర్రీస్, అవాక‌డో వంటివి తీసుకోవాలి.

అలాగే చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు, బీన్స్‌, పాలు, పెరుగు, తృణధాన్యాలు వంటివి కూడా డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకంటే, వీటిలో అనేక ర‌కాల పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి.

ఇవి టీబీ వ్యాధి నుంచి మిమ్మ‌ల్నీ త్వ‌ర‌గా రిక‌వ‌ర్ అయ్యేలా చేస్తాయి.

తాజా వార్తలు