తెలంగాణలో మంచి రోజులు రాబోతున్నాయి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) అనుకూలంగా రావడం తెలిసిందే.దాదాపు 60కి పైగా స్థానాలలో కాంగ్రెస్ గెలవబోతుందని అనేక ఎగ్జిట్ పోల్స్ లో( Exit Polls ) ఫలితాలు వచ్చాయి.

 Good Days Are Coming In Telangana Revanth Reddy Sensational Comments Details, Re-TeluguStop.com

దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో మంచి జోష్ నెలకొంది.ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెడితే గత రెండు దఫాలు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తూ వచ్చిందని సీరియస్ అయ్యారు.

ముందుగా ఎన్నికలు ఎలా జరుగుతాయో అని భావించామో అదే రీతిలో జరిగాయని రేపు ఫలితాలు కూడా… అలాగే వస్తాయని నమ్మకంతో ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనతో( KCR ) ఎంతో నిరాశ చెందారని అన్నారు.దీంతో ఓడించడానికి ఫిక్స్ అయ్యారని స్పష్టం చేశారు.కేసీఆర్ డిసెంబర్ 3వ తేదీన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరోపక్క బీఆర్ఎస్( BRS ) అధికారంలోకి వస్తుందని.డిసెంబర్ 4వ తారీకు తొలి క్యాబినెట్ సమావేశం అంటూ.

కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ రకంగా ఎవరికి వారు గెలుపు పై ప్రధాన పార్టీల నాయకులు ఉన్నారు.

మరి డిసెంబర్ మూడో తారీకు తెలంగాణ ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube