ఇద్దరు ప్లేయర్స్‌కూ గోల్డ్ మెడల్స్.. టోక్యో ఒలింపిక్స్‌లో రేర్ ఇన్సిడెంట్..

జపాన్ రాజధాని టోక్యో వేదికగా విశ్వ క్రీడా సంబురం ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఎక్కువ పతకాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.

భారత్ తరఫున క్రీడాకారిణి మీరాబాయి తొలి పతకం సాధించింది.తాజాగా తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు సృష్టించింది.

Gold Medals For Two Players Rare Incident At Tokyo Olympics , Olympics, Rare In

ఈ క్రమంలోనే ఆమెకు ప్రశంసలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి.కాగా, ఒలింపిక్స్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన ఈ అత్యంత అరుదైన సంఘటన చూస్తే మీరు ఆనందంతో పాటు ఆశ్చర్యపడుతారు.

Advertisement

సాధారణంగా ఒలింపిక్స్‌లో ఏదేని క్రీడాంశంలో ఇద్దరు ప్లేయర్స్ గోల్డ్ మెడల్స్ సాధించడం అరుదు.కాగా, అలాంటి అత్యంత అరుదైన సంఘటన తాజాగా చోటు చేసుకుంది.

మేల్స్ హై జంప్ ఈవెంట్‌లో ఈ సంఘటన జరిగింది.ఎవరూ ఊహించని రీతిలో ఒకటే ఈవెంట్‌లో ఇద్దరు విజేతలొచ్చారు.

ఖతర్‌ దేశానికి చెందిన ఇసా ముతజ్‌ బార్షిమ్, ఇటలీ దేశానికి చెందిన అథ్లెట్‌ గ్లాన్‌మార్కో టంబెరి హైజంప్‌ విజేతలుగా నిలిచారు.వీళ్లిద్దరు 2.37 మీటర్ల ఎత్తుకు ఎగిరి రికార్డు సృష్టించారు.ఈ క్రీడాంశంలో మూడో స్థానం పొందిన మాక్సిమ్‌ నెడసెకవు (బెలారస్‌) కూడా 2.37 మీటర్లు జంప్‌ చేసినప్పటికీ ఆయన ఎనిమిది ప్రయత్నాల్లో ఒక ఫౌల్‌ ఉంది.ఈ నేపథ్యంలో ఆయనకు బ్రాంజ్ మెడల్ లభించింది.

గతంలో ఇలా ఇద్దరు ప్లేయర్స్ బంగారు పతకాన్ని పంచుకున్న సంఘటనలున్నాయి.కాగా, ప్లేయర్స్‌కు ఈసారి చెరో బంగారు పతకం అందజేశారు నిర్వాహకులు.

పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?

గతంలో అనగా 1908 ఒలింపిక్స్‌ పోల్‌ వాల్ట్‌లో గోల్డ్ మెడల్‌ను ఇద్దరు ప్లేయర్స్ పంచుకున్నారు.ఈ విషయం తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు