Lakshmi Bhupala KA Paul : కేఏ పాల్ గురించి అలా మాట్లాడే వారికి ఈ బొమ్మ అంకితం.. గాడ్ ఫాదర్ రైటర్?

కేఏ పాల్ చాలామంది ఈ పేరు వినగానే ఒక కామెడీ పీస్ అని అనుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం కేఏ పాల్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తూ కామెడీ వీడియోలు చేస్తున్నారు.

దీంతో చాలామందికి కేఏ పాల్ అంటే ఒక కామెడీ పీస్ గానే గుర్తుండిపోయింది.కానీ కెఏ పాల్ ఎవరు అయినా అది ఏ ఊరు ఆయన గొప్పతనం ఏంటి అన్నది చాలామందికి తెలియదు.

కె పాల్ విశాఖపట్నం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.అంతే కాకుండా ప్రపంచ శాంతి దేవతగా ఎదిగాడు.

మొదట క్రైస్తవ మత బోధకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన కే ఏ పాల్ ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఎన్నో సేవా సంస్థలను ఏర్పాటు చేశారు.అంతేకాకుండా ప్రపంచ దేశాలు తీరుతూ శాంతిని క్రైస్తవం గొప్పతనం గురించి చాటిచెప్పారు.

Advertisement

అంతేకాకుండా అప్పట్లోనే కుబేరుడుగా సొంతంగా చార్టెడ్ విమానం కలిగిన ఏకైక మత బోధకుడిగా కూడా రికార్డును సృష్టించాడు.అలాగే ఎంతో మంది దేశాదిదేశ నేతలను కూడా కలిశారు ఆఫ్రికాలో ఎంతోమంది పేద ప్రజలను ఆదుకున్నారు.

కానీ అనుకోని కారణాలతో తన శక్తిని కోల్పోయిన కేఏ పాల్ ప్రస్తుతం సాధారణ వ్యక్తిగా మిగిలిపోయారు.అయితే ప్రస్తుతం ఆయనకు మనం గౌరవం లేకపోయినా ఆయన గతానికి అయినా మనం గౌరవం ఇవ్వాలి.

ఇదే విషయం గురించి సినీ రచయిత గాడ్ ఫాదర్ కి రైటర్ గా పని చేసిన లక్ష్మీ భూపాల గుర్తు చేశారు.స్వతహాగా చిత్రకారుడు అయిన లక్ష్మీ భూపాల తాజాగా కేఏ పాల్ చిత్ర పటాన్ని గీసి దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి కేఏ పాల్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ విధంగా రాసుకొచ్చాడు భూపాల.

నేను చిన్నప్పటి నుండి చూసిన అత్యంత శక్తివంతమైన క్రైస్తవ ఎవంజెలిస్ట్, శాంతి బోధకుడు, ఒకప్పటి కుబేరుడు కెఏ పాల్ గారి బొమ్మ నా కుంచెతో గీయడం గౌరవంగా భావిస్తున్నాను.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

నేను నిక్కర్లేసుకుని రంగు డబ్బా పట్టుకున్న రోజుల్లోనే పాల్ గారి సభలకు బొమ్మలేసి, బ్యానర్లు రాసినోడ్ని కాబట్టి, ఆయన్ని గత ముప్పై ఏళ్ల ముందునుంచి తెలిసినోడ్ని కాబట్టి ఇప్పుడు ఈ బొమ్మ గీసాను.కానీ ఈ మధ్య ఆయన్ని కేవలం కామెడీ పీస్‌గా భావించి ట్రోల్స్ చేస్తున్న చాలామంది ఈ తరం అవగాహనలేని సోషల్ మీడియా, న్యూస్ మీడియా సగం జ్ఞాన పండితుల్ని చూసి జాలేసి ఈ బొమ్మ గీస్తున్నాను.ఇప్పటి సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే పిల్ల నిబ్బా నిబ్బీలకు అంకితం చేస్తున్నాను.

Advertisement

ఆయన టీవీ ఇంటర్వ్యూలలో చెప్పే ఆయన గతం నూటికి నూరుశాతం నిజం.ఇప్పుడిలా ఎందుకయ్యారో ఏమిటో అనే చర్చ నాకు అనవసరం అని చెప్పుకొచ్చారు భూపాల్.

తాజా వార్తలు