భారీ వరదతో ఉగ్రరూపాన్ని దాల్చిన గోదావరి

ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చింది.దీంతో ముంపు మండలాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

గత ఎనిమిది రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎటపాక, చింతూరు, కూనవర, వీఆర్ పురం మండలాలు జలదిగ్భంధంలోనే చిక్కుకుని ఉన్నాయి.అటు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54 అడుగులకు చేరుకుంది.

ప్రధాన రహదారులపైకి వరద నీరు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.మరోవైపు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ముంపు మండలాల్లో అంధకారం అలుముకుంది.

ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు.లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)