11 లక్షల మంది అమ్మాయిలు కోవిడ్ తర్వాత స్కూల్ లకు కష్టమే అంటున్న నివేదికలు!

సమాజంలో స్త్రీలపై వివక్ష కొనసాగుతూనే ఉంది.ఎంతోమంది మేధావులు, సంఘసంస్కర్తలు ఎన్నో ఏళ్ల నుండి పోరాడుతున్న ఈ సమస్యకు పరిష్కారం లభించట్లేదు.

తాజాగా యునెస్కో అధ్యక్షుడు ఆడ్రీ అజౌలే రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పర్యటించారు.ఈ సమయంలో కరోనా మహమ్మారి అనంతరం సుమారు 11 లక్షల మంది అమ్మాయిలు చదువుకు దూరం అవుతారని తాము అంచనా వేసున్నట్టు తెలిపారు.

Girls Troubles Post Covid Coronavirus, 11 Lakhs Grils, Unesco Andrew Hazule, Ca

స్త్రీలకు మగవారి లాగే విద్యాబుద్ధులు సమానంగా అందాలని అలా అందకపోతే సమాజానికి,ప్రపంచానికి ఎలాంటి నష్టం కలుగుతుందో తెలియచెప్పడానికి తాము ఓ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేసినట్టు తెలిపారు.ఈ క్యాంపెయిన్ విజయవంతం కావడం కోసం ప్రపంచ దేశాలు అలాగే పిల్లల తల్లిదండ్రులు తమ వెంట నిలువాలని ఆయన కోరారు.

స్త్రీ సంక్షేమం ప్రపంచానికి ఎంతో అవసరం.ఈ విషయాన్ని గుర్తించిన ప్రపంచదేశాలు గత దశాబ్దకాలంగా యునెస్కో తమ సాయశక్తులా సహకారాన్ని అందిస్తున్నాయి.

Advertisement

వీటి ప్రభావం కొన్నిచోట్ల ఫలితాన్ని ఇస్తున్న మరికొన్ని చోట్ల విఫలమవుతున్నాయి.తాలిబన్ ప్రభావిత ప్రాంతాలలో వాళ్ళు స్త్రీ శక్తికి భయపడుతున్నారు అందుకే స్త్రీ విద్యకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ అరాచకాలు చేస్తున్నారు.

ఇలాంటి వారిని ప్రపంచం కంట్రోల్ చేయగలిగితే సమాజంలో స్త్రీల పట్ల ఉన్న వివక్ష తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు