సికింద్రాబాద్ కళాసిగూడ ఘటనపై జీహెచ్ఎంసీ చర్యలు

సికింద్రాబాద్ కళాసిగూడలో నాలాలో పడి చిన్నారి మృతిచెందిన ఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలకు సిద్ధం అయింది.

ఇందులో భాగంగా ఇద్దరు అధికారులపై జీహెచ్ఎంసీ సస్పెన్షన్ వేటు వేసింది.

ఏఈ తిరుమలయ్యతో పాటు వర్క్ ఇన్ స్పెక్టర్ బి.ఎం.హరికృష్ణను సస్పెండ్ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్.ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఈఈ ఇందిరాబాయికి ఆదేశాలు జారీ చేశారు.

పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈఈకి కమిషనర్ సూచించారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement