నంద్యాల జిల్లాలో కొందరు వ్యాపారులు ఘరానా మోసానికి పాల్పడ్డారు.ఎరువులు తక్కువ ధరలకే ఇస్తామని రైతులను నమ్మించారు ముగ్గురు వ్యాపారులు.అనంతరం అన్నదాతల నుంచి రూ.13 కోట్లు కాజేసి పరార్ అయ్యారని తెలుస్తోంది.దీంతో మోసపోయామని గ్రహించిన రైతులు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ వ్యాపారులను పట్టుకుని రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.