చిన్న వయసులోనే ముఖంపై ముడతలా.. ఇలా వ‌దిలించుకోండి!

వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడడం అనేది చాలా కామన్.

కానీ ఇటీవల రోజుల్లో ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, హార్మోన్ల ప్రభావం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే కొందరికి ముఖంపై ముడతలు( Face Wrinkles ) ఏర్పడుతున్నాయి.

ఈ మడతలను వదిలించుకునేందుకు పడే తంటాలు అన్ని ఇన్ని కావు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలను పాటిస్తే సులభంగా ముడతలను మాయం చేసుకోవచ్చు.

Get Rid Of Wrinkles With These Home Remedies Details, Home Remedies, Wrinkles, W

రెమెడీ 1:

ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ,( Papaya Puree ) వన్ టీ స్పూన్ తేనె,( Honey ) వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై 15 నిమిషాలు చర్మాన్ని ఆరబెట్టుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు క్రమంగా మాయమవుతాయి.బొప్పాయి పండు లోని విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి.

Advertisement
Get Rid Of Wrinkles With These Home Remedies Details, Home Remedies, Wrinkles, W

స్కిన్ ను టైట్ గా బ్రైట్ గా మారుస్తాయి.

Get Rid Of Wrinkles With These Home Remedies Details, Home Remedies, Wrinkles, W

రెమెడీ 2:

ముడతల సమస్యతో బాధపడే వారికి మరొక అద్భుతమైన రెమెడీ ఉంది.నైట్‌ నిద్రించే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్,( Coconut Oil ) వన్ టీ స్పూన్ రోజ్‌ వాటర్,( Rose Water ) హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేసుకుని నిద్రించాలి.

మరుసటి రోజు గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ చిట్కాను పాటించిన కూడా ముడతలు దెబ్బకు పరారవుతాయి.

చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా మారుతుంది.

సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?
Advertisement

తాజా వార్తలు