ఇటీవల కాలంలో పెట్రోల్ రేట్లను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ధరలు కాస్త తగ్గాయి.
వివిధ రాష్ట్రాల్లో వ్యాట్ కూడా తగ్గడంతో పెట్రోల్ ధరలు కొంచెం ఉపశమనం కలిగించాయి.అయితే పట్టపగ్గాలు లేకుండా పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యుడు కుదేలవుతున్నాయి.
వాహనం బయటకు తీయాలంటేనే పెట్రోల్ ధర తలచుకుని జంకుతున్నాడు.ఈ తరుణంలో ఓ బ్యాంకు తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది.
ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తోంది.దానికి సంబంధించిన ఆసక్తికర వివరాలిలా ఉన్నాయి.
ఇండియన్ ఆయిల్ సంస్థతో కలిసి సిటీ బ్యాంకు ఓ ఫ్యూయల్ క్రెడిట్ కార్డును అందిస్తోంది.దాని ద్వారా పెట్రోల్ కొట్టించుకున్న ప్రతిసారీ రివార్డు పాయింట్లు వస్తాయి.వీటిని టర్బో పాయింట్లు అంటారు.పెట్రోల్ బంకుల్లో రూ.150 పెట్రోల్ కొట్టించుకుంటే 4 టర్బో పాయింట్లు లభిస్తాయి.సూపర్ మార్కెట్లలో రూ.150 బిల్ చేస్తే 2 టర్బో పాయింట్లు మన ఖాతాలో చేరతాయి.ఇతర సాధారణ ట్రాన్సాక్షన్స్ రూ.150 దాటితే ఒక టర్బో పాయింట్ మనకు దక్కుతుంది.ఈ ఒక్కో టర్బో పాయింట్‌ను ఒక్కో రూపాయిగా లెక్కిస్తారు.
అలా ఈ టర్బో పాయింట్లను ఎస్ఎంఎస్ ద్వారా రెడీమ్ చేసుకోవచ్చు.ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో వాటి ద్వారా పెట్రోల్ పొందొచ్చు.
ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుతో కలిసి సిటీ బ్యాంకు రూపొందించిన ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డుకు కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఈ కార్డును పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం ఏది కొన్నా మరేదో రూపంలో మనకు రివార్డు పాయింట్లు లభిస్తున్నాయి.వాటిని క్యాష్ చేసుకునేందుకు ప్రజలు అమితాసక్తి చూపుతున్నారు.








