జర్మనీ దేశం( Germany ) యూరోపియన్ యూనియన్ (EU) నుంచి కాకుండా విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్యను పెంచే ప్రణాళికలు ప్రకటించింది.దేశంలో కార్మికుల కొరతను( Labour Shortages ) పరిష్కరించడానికి జర్మనీ ముసాయిదా సంస్కరణలను ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే నైపుణ్యం గల శ్రామిక శక్తిని కాపాడుకోవడం దేశ భవిష్యత్తు, ఆర్థిక భద్రతకు చాలా కీలకమని కార్మిక మంత్రి హుబెర్టస్ హీల్ అన్నారు.2022లో దాదాపు 20 లక్షల ఉద్యోగ ఖాళీలతో దేశం ఆర్థిక విజయానికి దోహదపడే స్కిల్డ్ వర్కర్స్‌ను స్వాగతించాలని జర్మన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.కాగా తాజా సంస్కరణలు విదేశాల నుంచి కార్మికుల సంఖ్యను సంవత్సరానికి 60,000 మంది వరకు పెంచగలవు.
ముసాయిదా చట్టం విదేశీ కార్మికులు జర్మనీలోకి ప్రవేశించడానికి మూడు మార్గాలను ప్రతిపాదిస్తుంది.మొదటి మార్గానికి జర్మనీలో గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ లేదా యూనివర్సిటీ డిగ్రీ, ఉద్యోగ ఒప్పందం అవసరం.
రెండవది సెక్టార్‌లో రెండేళ్ల సంబంధిత పని అనుభవం, డిగ్రీ లేదా కెరీర్ ట్రైనింగ్ అవసరం.మూడవ మార్గం అనేది పనిని కనుగొనగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఇంకా జాబ్ ఆఫర్ పొందకపోతే వారికి అందించే కొత్త ఆపర్చునిటీ కార్డ్.
కార్డ్ పాయింట్ల ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది.ఇది అర్హతలు, భాషా నైపుణ్యాలు, వృత్తిపరమైన అనుభవం, జర్మనీకి కనెక్షన్, వయస్సును పరిగణనలోకి తీసుకుంటుంది.
జర్మనీ మంత్రి నాన్సీ ఫేజర్ మాట్లాడుతూ, ప్రజలు వృత్తిపరమైన అనుభవం లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని తీసుకువస్తే, దేశం వారు జర్మనీలో పని చేసే అవకాశం కల్పిస్తుందని అన్నారు.క్యాబినెట్ విద్యా చట్టానికి కూడా ఆమోదం తెలిపింది, ఇది యువతకు చెల్లింపు-ఉద్యోగ శిక్షణను పొందే హక్కును కల్పించింది.శిక్షణ కాలంలో జర్మన్ ఫెడరల్ లేబర్ ఏజెన్సీ నికర జీతంలో 67% వరకు చెల్లిస్తుంది.
ఈ సంస్కరణలు వలస విధానంలో కొత్త ప్రారంభానికి పునాది వేస్తున్నాయని, నైపుణ్యం కలిగిన వర్కర్‌గా దేశ ఆర్థిక విజయానికి దోహదపడే ఎవరికైనా స్వాగతం పలుకుతారని ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిండ్‌నర్ ట్వీట్ చేశారు.ప్రతిపాదిత సంస్కరణలు వలస విధానంలో కొత్త ప్రారంభాన్ని అందించగలవని.దేశంలోని కార్మికుల కొరతను పరిష్కరించడంలో సహాయపడతాయని జర్మన్ ప్రభుత్వం భావిస్తోంది.
సంవత్సరానికి 60,000 జాబ్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి భారతీయులు, ఎన్నారైలు వీటికి అప్లై చేసుకోవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy