జార్జియా స్కూల్‌లో కాల్పులు : ‘‘ సారీ మామ్ ’’ .. అంటూ తల్లికి మెసేజ్ పెట్టిన నిందితుడు

రెండ్రోజుల క్రితం అమెరికా( America )లోని జార్జియాలో 14 ఏళ్ల హైస్కూల్ విద్యార్ధి ఉన్మాదిలా మారి తరగతి గదిలోనే కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోగా.

పలువురు గాయపడ్డారు.ఈ ఘటనపై పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

నిందితుడు కోల్డ్ గ్రే( Colt Gray, ).సెప్టెంబర్ 4న ఉదయం విండర్‌లోని అపాలాచీ హైస్కూల్‌లో కాల్పులు జరపడానికి ముందు అతని తల్లి మార్సీ గ్రేకు సందేశం పంపాడు.ఆమెకు అందులో “I’m sorry, mom అంటూ తల్లికి క్షమాపణలు చెప్పినట్లుగా బాలుడి తాత చెప్పాడు.

దీంతో ఏదో జరగబోతోందని ఊహించిన మార్సీ వెంటనే అపాలాచీ హైస్కూల్‌కు కాల్ చేసి అలర్ట్ చేశారు.తన కొడుకు వద్దకు వెళ్లి అతనిని తనిఖీ చేయాలని ఆమె స్కూల్ సిబ్బందిని కోరారు.అంతేకాదు కొడుకు నుంచి టెక్స్ట్ మెసేజ్( Text message ) వచ్చిన తర్వాత తన ఇంటి నుంచి కారులో మూడు గంటల పాటు డ్రైవింగ్ చేసి విండర్‌కు చేరుకుంది.

Advertisement

అప్పటికే స్కూల్‌లో కాల్పులు జరిగాయని.ఇద్దరు విద్యార్ధులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించినట్లుగా మార్సీకి సమాచారం అందింది.

అయితే ఆమె గతంలో తన సోషల్ మీడియాలో తన మాజీ భర్తతో పాటు తమ వైవాహిక జీవితంలోని ఇబ్బందులను కూడా పంచుకుంది.తాను తన పిల్లలను తీసుకుని దక్షిణ జార్జియా( Georgia లోని తన స్వగ్రామానికి వచ్చామని, పిల్లలు ఎదుగుతున్నారని మార్సీ మే 2023లో లింక్డ్‌ఇన్‌లో రాసుకొచ్చారు.ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ప్రభావం కోల్డ్ గ్రేపై పడిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మరణించిన నలుగురు వ్యక్తులను మ్యాథ్స్ టీచర్ రిచర్డ్ ఆస్పిన్‌వాల్, క్రిస్టినా ఇరిమీ.విద్యార్ధులు మాసన్ షెర్మెర్‌హార్న్ , క్రిస్టియన్ అంగులోగా గుర్తించారు.అలాగే దాదాపు 9 మంది విద్యార్ధులు గాయపడ్డారని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి నిందితుడు గ్రేను బాల నేరస్థుల కేంద్రంలో ఉంచి మైనారిటీ తీరిన తర్వాత హత్యానేరం మోపే అవకాశం ఉందని అమెరికన్ మీడియా పేర్కొంది.

జపాన్‌: ఈ లిమిటెడ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో లగ్జరీ ఫెసిలిటీస్.. చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు