Geethika Tiwari : మధ్య ప్రదేశ్ అడవుల్లో అలాంటి టార్చర్ చూశానన్న అహింస హీరోయిన్.. అలాంటి పాత్రంటూ?

టాలీవుడ్ డైరెక్టర్ తేజ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అహింస.ఈ సినిమాలో అభిరాం దగ్గుబాటి( Daggubati Abhiram ) హీరోగా నటించిన విషయం తెలిసిందే.

ఇందులో గీతికా తివారీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్బంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

Advertisement

ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా గీతికా తివారి ( Geethika Tiwari )మాట్లాడుతూ తన పాత్ర గురించి తెలిపింది.సంస్కృతి ప్రకృతి కుటుంబంతో ముడిపడిన కథ ఇది.ఇందులో అహల్య నా పాత్ర పేరు.ఇందులో అమాయకంగా కనిపిస్తాను.

కానీ శక్తివంతమైన యువతిగా ఎదిగే తీరు ఆకట్టుకుంటుంది.ఆ పాత్ర గురించి తేజ చెబుతున్నప్పుడు లవ్ లో పడిపోయాను.

ప్రేమపై నమ్మకమున్న అహల్యపడే కష్టాలు.ఆమెకి ఎదురయ్యే సవాళ్లు సినిమాలో చాలా కీలకం.

తేజ సర్ తనదైన శైలిలో రూపొందించారు.90 శాతం మధ్యప్రదేశ్ అడవుల్లోనే( Madhya Pradesh ) షూటింగ్ చేసాం.దట్టమైన అడవుల్లో షూటింగ్ ఇబ్బంది గా అనిపించినా తప్పలేదు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

సన్నివేశాలకు ఆలో కేషన్లు డిమాండ్ చేయడంతో కష్టం అయినా భరించాము.నిజంగా అదొక మంచి అనుభవం.

Advertisement

కష్టపడినప్పుడే దాని విలువ తెలుస్తుంది.తొలి సినిమాతోనే నటులకు ఎదురయ్యే సవాళ్లని ఎదురయ్యాయి.

ఇక నా నేటివ్ ప్లేస్ కూడా ఎంపీనే.అక్కడే పుట్టి పెరిగాను.

డిగ్రీ తర్వాత గ్లామర్ ప్రపంచంలోకి వచ్చేసాను.అయితే మొదట కొన్ని యాడ్స్ చేసాను అని చెప్పుకొచ్చింది గీతికా తివారీ.

తాజా వార్తలు