వైఎస్ షర్మిలను ప్రశ్నిస్తున్న గంగుల కమలాకర్.. !

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్తపార్టీ స్దాపిస్తుందని ప్రకటించినప్పటి నుండి వైఎస్ షర్మిల మీద ఎన్నో విమర్శలు వచ్చాయి.

వాటన్నీంటిని పట్టించుకోకుండా తాను చేయాలనుకున్న పనిని పక్కా ప్రణాళికతో అమలు చేస్తూ ముందుకు వెళ్లుతున్నారు షర్మిల గారు.

కాగా ఇప్పటికే పలువురు టీయార్ఎస్ నేతలు షర్మిల పార్టీ పై విమర్శలు గుప్పించారు.ఇంకా ఆ ఆరోపణల బాణాలు గులాభినేతల నుండి అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి.

Gangula Kamalakar Direct Question To Ys Sharmila, Karimnagar, Trs, Gangula Kamal

ఇక తాజాగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన అంశంపై తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.టూకీగా చెప్పాలంటే దొర కేసీయార్ తెలంగాణ ప్రజలను కన్న బిడ్దల వలే చూసుకుంటున్నారని కాబట్టి ఇక్కడ ఇతర ప్రాంతీయుల ప్రాతినిథ్యం అవసరం లేదంటూ తెలిపారు.

కాగా కరీంనగర్ సిటీ రినోవేషన్ పేరిట నగర ఆధునికీకరణ ఇప్పటికే ప్రారంభమైందని, బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ద్వారా మానేరు రివర్ ఫ్రంట్ పురుడు పోసుకుందని వివరించారు.ఇకపోతే శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న గంగుల పై విధంగా వ్యాఖ్యానించారు.

Advertisement
13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

తాజా వార్తలు