రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది.విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం సహకారంపై సమావేశంలో చర్చించనున్నారు.
ఈ క్రమంలో ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.గతంలో ఏపీ హైకోర్టు.
రాజధానిగా అమరావతే ఉంటుందని తీర్పు ఇచ్చింది.కానీ ఈ నెలలో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించి బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే.
విభజన అంశాలకు సంబంధించి అన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారంపై ఈ భేటీలో చర్చించబోతున్నామంటూ కేంద్ర హోంశాఖ ఏపీ, తెలంగాణకు పంపించిన అజెండాలో పేర్కొంది.
తెలంగాణ నుంచి ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.







